సముద్ర తీరంలో వింత జీవి కలకలం.. అదేంటో తేల్చిన పరిశోధకులు..

సముద్రాల్లో లక్షలకొద్దీ జాతుల జీవరాశులు ఉంటాయి.ఒక్కోటి ఒక్కో విధంగా ఉంటాయి.

 Researchers Have Uncovered A Strange Creature On The Beach, Samudra, Rare Living-TeluguStop.com

వీటిలో కొన్నిటిని చూస్తే మనం భయంతో వణికిపోక తప్పదు.థ్రిల్లర్, హారర్ సినిమాల్లో చూపించే వింత జీవుల కంటే ఇవి మరింత వికృతంగా, భయానకంగా ఉంటాయనడంలో సందేహం లేదు.

ఇప్పటికే ఇలాంటి ఎన్నో వింత జీవులు వెలుగులోకి వచ్చి అందరికీ షాక్ ఇచ్చాయి.తాజాగా అలాంటి మరొక వింత జీవి అమెరికాలోని ఒరెగాన్‌లోని మిల్ బీచ్‌ ఒడ్డున ప్రత్యక్షం అయ్యింది.

ఇది చూసేందుకు పిరానా చేప లాగానే కనిపించిందని కానీ దీని ఆకారం మాత్రం చాలా వింతగా ఉన్నట్లు స్థానికులు మీడియాకి వెల్లడించారు.దీన్ని చూసిన చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

ఈ వింత జల రాశికి సంబంధించిన ఒక ఫోటో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

ఈ ఫొటోలో ఈ చేపకు సూదులు వంటి పళ్లు, పొడవాటి తోక ఉంది.

ఈ ఆకారంతో అది రాక్షసి చేపలా కనిపిస్తోంది.అప్పటికే ఇది చనిపోయింది.

సముద్ర గర్భంలో ఈ చేప ఉంటుందా లేక పైనే ఉంటుందా అనేది మాత్రం ఇంకా తెలియ రాలేదు.ఇది చనిపోయిన తరువాత దాని కళేబరం ఒడ్డు మీదకి కొట్టుకొని రావచ్చని తెలుస్తోంది.

మొదట దీనిని చూసిన స్థానికులు ఇది ఒక పిరానా అని అనుకున్నారు.ఇంకొందరు దీనిని వోల్ఫ్ ఈల్ అని అభిప్రాయపడ్డారు.

కానీ ఇది వారు ఊహించిన చేప ఏం కాదని పరిశోధకులు తేల్చారు.ఇదొక మంకీఫేస్ ప్రికిల్ బ్యాక్ ఈల్‌ అని వారు అందరికీ క్లారిటీ ఇచ్చారు.

ఈ వింత జీవులు కేవలం నార్త్ అమెరికాలోని పసిఫిక్ కోస్టల్ రీజియన్‌లో మాత్రమే కనిపిస్తాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube