ఉద్యోగులకు షాక్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్.. 300ల మంది తొలగింపు

ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కీలక నిర్ణయం తీసుకుంది.మొదటిసారి చందాదారులను భారీగా కోల్పోయిన తర్వాత ఖర్చులను తగ్గించే లక్ష్యంతో ఏకంగా 300ల ఉద్యోగులను తొలగించింది.

 Netflix Shocked Employees 300 Laid Off , Netflix, Employees, Shock, Viral Lates-TeluguStop.com

రెండవ రౌండ్ ఉద్యోగ కోతలలో దాదాపు 4% మంది ఉద్యోగులను తొలగించినట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది.ఈ చర్య దాని అమెరికా ఉద్యోగులను ఎక్కువగా ప్రభావితం చేసింది.

ఇక గత నెలలోనే 150 ఉద్యోగాలను తొలగించిన విషయం తెలిసిందే.తాము వ్యాపారంలో గణనీయమైన పెట్టుబడులు పెట్టామని, ఈ సర్దుబాట్లు చేశామని వెల్లడించింది.

తద్వారా నెమ్మదిగా ఆదాయ వృద్ధికి అనుగుణంగా మా ఖర్చులు పెరుగుతాయని నెట్‌ఫ్లిక్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ద్రవ్యోల్బణం, ఉక్రెయిన్‌లో యుద్ధం, తోటి స్ట్రీమింగ్ కంపెనీలతో విపరీతమైన పోటీ వంటి అంశాలు చందాదారుల పెరుగుదలపై ప్రభావం చూపుతోంది.

ఆ డౌన్‌ట్రెండ్‌ను అరికట్టడానికి, కంపెనీ చవకైన సబ్‌స్క్రిప్ష‌న్‌లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.నెట్‌ఫ్లిక్స్ 2022 మొదటి త్రైమాసికంలో 2 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది.

ఇది కంపెనీ స్టాక్ మార్కెట్ ధరను దెబ్బతీశాయి.దీంతో ఖర్చులను ఆదా చేసుకునేందుకు క్రమంగా ఉద్యోగులను తొలగిస్తూ వస్తోంది.

జనవరిలో ధరల పెంపు కారణంగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్ కష్టాలు బాగా పెరిగాయి.దీంతో అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్ స్టార్ వంటి సంస్థలతో తీవ్రమైన పోటీ నెలకొంది.

నెట్ ఫ్లిక్స్‌తో పోలిస్తే మిగిలిన వాటి సబ్‌స్క్రైబ్ ధర బాగా తక్కువ.ఫలితంగా సబ్ స్క్రైబ్ ఫీజులను తగ్గించాలని నెట్ ఫ్లిక్స్ భావిస్తోంది.

అయితే ఖర్చులను తగ్గించుకునేందుకు భారీగా ఉద్యోగులను తొలగించడంపైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube