అమెరికా : సుప్రీంకోర్టు సంచలన తీర్పు...తీవ్ర నిరాశలో బిడెన్..!!

వివాదాస్పద నిర్ణయాలకు అగ్ర రాజ్యం ఎప్పుడూ కేంద్ర బిందువుగానే ఉంటుంది.అమెరికాలో గన్ కల్చ పై ఎలాంటి వ్యతిరేకత ఉందో అందరికి తెలిసిందే.

 Us Supreme Court Strikes Down New York's Handgun Law,us Supreme Court,,new York,-TeluguStop.com

గడిచిన నెలలో సుమారు 19 మంది చిన్న పిల్లలు ఓ స్కూల్ లో అత్యంత దారుణంగా గన్ కల్చర్ కు బలై పోయిన విషయం తెలిసిందే.ఈ ఘటనలోనే ఇద్దరు టీచర్స్ కూడా మృతి చెందారు.

ప్రతీ ఏటా వేలాది మంది గన్ కల్చర్ కు బలై పోతున్నారు.ఈ క్రమంలో తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ గన్ కల్చర్ ను నియంత్రించాలని అందుకు చట్టాలు రావాలని పిలుపునిచ్చారు.

అధ్యక్షుడి పులుపు మేరకు అమెరికాలో పలు రాష్ట్రాలు గన్ కల్చర్ పై చట్టాలు తీసుకువచ్చాయి.ప్రజలు కూడా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై సంతోషం వ్యక్తం చేశారు.కానీ ఊహించని విధంగా అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.గన్ కల్చర్ కి వ్యతిరేకంగా న్యూయార్క్ రాష్ట్రం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టేసింది.

తుపాకి హక్కులను విస్తృతం చేస్తూ స్వీయ రక్షణ కోసం అమెరికా పౌరులు తమతో తుపాకులను తీసుకువెళ్ల వచ్చునని, ఎలాంటి నియంత్రణ ఇకపై ఉండదని ఈ మేరకు న్యూయార్క్ రాష్ట్రం తాము విధించిన చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని రద్దు చేస్తూ తీర్పు చెప్పింది.

Telugu Congress, Gun, Gun Violence, York, Supreme-Telugu NRI

సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు కేవలం న్యూయార్క్ రాష్ట్రానికి మాత్రమే చెల్లదని, అన్ని రాష్ట్రాలు సుప్రీం తీర్పును పాటించాల్సి వస్తుందని తెలుస్తోంది.సుమారు 19 మంది చిన్న పిల్లలు చనిపోయిన ఘటన ఇంకా కళ్ళ ముందు కదలాడుతున్నా సుప్రీం కోర్టు ఈ విధమైన తీర్పు ఇవ్వడం పై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.గన్ కల్చర్ నియంత్రణ కై ఎన్నో ఏళ్ళుగా పోరాటాలు చేస్తున్న స్వచ్చంద సంస్థలు కాంగ్రెస్ సభ్యులు తీర్పు పై పెదవి విరుస్తున్నారు.

కాగా ఈ తీర్పు పై బిడెన్ తీవ్ర నిరాశతో ఉన్నారని తెలుస్తోంది.ఈ తీర్పు రాజ్యంగా విరుద్దమని తెలిపారు.కాగా ఈ తీర్పుపై పోరాటం చేస్తామని తుపాకి నియంత్ర చట్టాలని తీసుకువచ్చే వరకూ కృషి చేస్తామని అంటున్నారు స్వచ్చంద సంస్థల ప్రతినిధులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube