కంగనా రనౌత్ శాపం వల్లే మహారాష్ట్ర సీఎం పదవికి ముప్పు?

ప్రస్తుతం దేశం మొత్తం మహారాష్ట్ర వైపు చూస్తోంది.అక్కడ రాజకీయ అనిశ్చితికి కారణం బీజేపీ అంటూ కొందరు వాదిస్తుండగా,మరి కొందరు శివసేన పార్టీ హిందుత్వంను వీడటం అంటూ మరి కొందరు వాదిస్తున్నారు.

 Kangana Ranaut's Aaj Mera Ghar Video Goes Viral As Uddhav Leaves Varsha,kangana-TeluguStop.com

ఈ సమయంలోనే కొందరు మాత్రం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ పెట్టిన శాపం ఆమె కన్నీళ్లు ఉద్ధవ్ ఠాక్రే యొక్క ముఖ్యమంత్రి పీఠం ను కదిలించాయి అంటున్నారు. ఉద్దవ్ ఠాక్రే సీఎంగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది.

శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ఎట్టిపరిస్థితుల్లో ఉద్ధవ్ ఠాక్రే కు మద్దతు ఇచ్చేది లేదు అని తేల్చి చెప్పడంతో బీజేపీ అతి త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అని తేలిపోయింది.

సొంత పార్టీ నేతలను ఎమ్మెల్యేలను కాపాడుకోలేక పోయారు అంటూ ఉద్దవ్ పై మహా వికాస్ అఘడిలోని ఇతర పార్టీ నాయకులు విమర్శలు గుప్పిస్తన్నారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కంగనా రనౌత్ పాత వీడియోలు వైరల్ అవుతున్నాయి.అయితే కొన్నాళ్ల క్రితం కంగనా రనౌత్ బీజేపీ కి మద్దతుగా శివసేన పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ముఖ్యమంత్రి మరియు ఆయన తనయుడు పై కూడా చాలా సీరియస్ గా విమర్శలు చేసింది కంగానా.ఆ సమయంలో శివసేన కార్యకర్తలు ఆమెను ముంబయి లో తిరగనివ్వం అంటూ హెచ్చరించిన విషయం కూడా తేలిసిందే.

బ్యూటి కంగనా ఎంతో ఇష్టపడి కట్టుకున్న మణికర్ణిక ఆఫీస్ ను ముంబయి మున్సిపల్ అధికారులు నిబంధనలకు విరుద్దంగా ఉందంటూ కూల్చేసిన విషయం తెలిసిందే.

కంగనా ఆ సమయంలో ఒక వీడియోను కూడా విడుదల చేసింది.ఆ వీడియో లో నేడు నీ చేతిలో అధికారం ఉంది కనుక ఇలా చేశావు.కాని ఆ అధికారం నీకు ఎప్పటికి ఉండదు అని గుర్తు పెట్టుకో అంటూ హెచ్చరించింది.

మరో వీడియో లో ఆమె మాట్లాడుతూ ఒక మహిళను బాధ పెట్టిన ఏ ఒక్కరు సుఖ పడ్డట్లు సంతోషంగా ఉన్నట్లుగా లేదు.త్వరలోనే మీ పతనం ఉంటుందని కంగనా ఆ సమయంలో శాపం పెట్టింది.

ఆమె శాపం చాలా తక్కువ సమయంలోనే నిజం అయ్యింది అన్నట్లుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తూ సదరు వీడియోలను షేర్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube