ఎన్నికల్లో జగన్ సర్కార్‎పై వ్యతిరేకత..

నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. వైసీపీ .

 Opposition To Jagan Sarkar In Elections , Jagan Sarkar , Elections , Nellore Di-TeluguStop.com

బీజేపీ మరికొందరు బరిలో ఉన్నారు.టీడీపీ ఈ ఉప ఎన్నికకు దూరంగా ఉంది.

ఇక్కడ పోలింగ్ హుషారుగా నే సాగుతోంది.ఏపీ లోని ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.ఇప్పటివరకు కొంచెం అటుఇటుగా 60 శాతం ఓటింగ్ న‌మోదైంది.గంట‌కు స‌రాస‌రి 8శాతం చొప్పున పోలింగ్ జరుగుతోందని తెలుస్తోంది.ఇదే విధంగా పోలింగ్ జ‌రిగితే పోలింగ్ ముగిసే సమయానికి 70 శాతం ఓటింగ్ నమోదు కావచ్చు. పోలింగ్‌ ప్రక్రియ పర్యవేక్షణ వెబ్‌కాస్టింగ్‌ ద్వారా జరుగుతోంది.

వైసీపీ కి చెందిన మంత్రి గౌతంరెడ్డి ఆకస్మిక మృతితో ఆత్మకూరు స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది.పోలింగ్‌ కేంద్రాల్లో కొవిడ్‌ ప్రొటోకాల్‌తో పాటు మహిళల కోసం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు.

ఎన్నికల విధుల్లో 1409 మంది పోలింగ్‌ సిబ్బంది, 1100 మంది పోలీసులు పాల్గొన్నారు.ఈనెల 26న ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది.

అదేరోజు ఫలితాలు వెలువడుతాయి.

Telugu Atmakuru, Bharatkumar, Cm Jagan, Jagan Sarkar, Nellore, Process-Political

చనిపోయిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఉప ఎన్నికలో పోటీచేస్తే బరిలో ఉండకూడదన్న ఆనవాయితీని పాటిస్తూ టీడీపీ ఇక్కడ పోటీ లేదు.అయితే బీజేపీ తన అభ్యర్థిగా భరత్‌కుమార్‌ను దించింది. 2019 ఎన్నికల్లో నియోజకవర్గంలో 82 శాతం పోలింగ్‌ జరిగింది.

నాడు వైసీపీ 22 వేల పై చిలకు ఓట్లతో గెలుపొందింది.అప్పట్లో మొత్తం పోలైన ఓట్లలో టీడీపీకి 40.44 శాతం ఓట్లు వచ్చాయి.ప్రస్తుత ఉప ఎన్నిక బరిలో టీడీపీ లేని కారణంగా ఆ పార్టీ సానుభూతిపరులు ఓటింగ్‌కు దూరంగా ఉంటారా ? మరెవరికైనా ఓటు వేస్తారా అనేది సస్పెన్స్.వైసీపీ కనీసం 80 వేల ఓట్ల మెజారిటీ ని అంచనా వేస్తున్నది.కాగా జగన్ సర్కార్ పై కొంత వ్యతిరేకత లేకపోలేదు.అది ఏమేరకు వర్కౌట్ అయిందో ఫలితాలు వస్తే కానీ చెప్పలేం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube