సీరియల్స్ కు దూరంగా.. సమాజసేవకు దగ్గరగా.. అలా ప్రశాంతంగా జీవిస్తున్న డాక్టర్ బాబు?

బుల్లితెరలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి అందరికీ తెలిసిందే.ఈ సీరియల్ అతి తక్కువ సమయంలో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

 Doctor Babu Living His Life Away From Serial Close To Social Service Details,  N-TeluguStop.com

ఈ సీరియల్ పట్ల ప్రేక్షకులకు ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.సెలబ్రెటీలు కూడా ఈ సీరియల్ కు ఎంతలా వాలిపోయారో చూస్తూనే ఉన్నాం.

ఇందులో నటించే కార్తీక్, దీప, సౌందర్య, మోనిత పాత్రలకు బాగా ఆకర్షితులయ్యారు.

ఇక వీరి గురించి ఏ వార్త వచ్చిన వైరల్ గా మారుతుంది.

ముఖ్యంగా అందులో డాక్టర్ బాబు గురించి ఏ వార్త వచ్చినా సరే అది వెంటనే వైరల్ గా మారుతుంది.ఎందుకంటే ఆయనకున్న అభిమానం అలాంటిది కాబట్టి.ఈ సీరియల్ తో డాక్టర్ బాబుగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు నిరుపమ్ పరిటాల. అంతేకాకుండా బుల్లితెర స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు.

ఎన్నో సీరియళ్ళలో నటించిన ఈయన ఈ సీరియల్ తోనే మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.ఇక ఈయన మరో బుల్లితెర నటి మంజులను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

మంజుల కూడా పలు సీరియల్స్ లో నటించి మంచి పేరు సంపాదించుకుంది.అంతేకాకుండా హిట్లర్ గారి పెళ్ళాం అనే మరో సీరియల్ లో కూడా నటించిన సంగతి తెలిసిందే.

ఈ సీరియల్ కూడా నిరూపమ్ కు మంచి గుర్తింపు అందిస్తుంది.

Telugu Deepa, Babu, Karthikadeepam, Manjula, Monitha, Nirupam, Poor, Serials, Sl

ఇక ఈ సీరియల్ తో పాటు మరిన్ని సీరియల్స్ లో అవకాశాలు రాగా డేట్స్ కుదరకపోవడంతో వదులుకున్నాడు.పైగా వెండితెరపై కూడా పలు సినిమాలలో అవకాశాలు అందుకోగా వదులుకున్నాడు.ఇదిలా ఉంటే ఈయన పాత్ర కార్తీకదీపం లో ముగిసిన సంగతి తెలిసిందే.నిజానికి ఈ సీరియల్ నుండి రోజుకు రూ.22 వేల రూపాయల వరకు పారితోషికం అందుకున్నాడు.

అంతేకాకుండా మరో రెండు సీరియల్స్ లో కూడా నటించడంతో ఆయన రోజు సంపాదన రూ.60 వేలకు పైగా ఉండేది.ఈయన నెలకు దాదాపు రూ.14 లక్షలకు పైగానే సంపాదిస్తాడు.పైగా వైజాగ్ లో రూ.5 కోట్ల విలువ చేసే ప్రాపర్టీ ఉందని, హైదరాబాద్ లో శ్రీనగర్ కాలనీలో రూ.80 లక్షలు విలువ చేసే ప్లాటు ఉందని సమాచారం.అంతేకాకుండా రూ.11 లక్షల విలువచేసే రెండు కార్లు కూడా ఉన్నాయట.

Telugu Deepa, Babu, Karthikadeepam, Manjula, Monitha, Nirupam, Poor, Serials, Sl

మొత్తానికి బుల్లితెర నుండి మంచి సంపాదన అందుకున్న నిరూపమ్ తన డబ్బులతో ఎంతో మందికి సహాయం చేస్తున్నాడు.తాజాగా దానికి సంబంధించిన ఒక ఫోటో కూడా మరింతగా మారగా.స్లమ్ ఏరియాలో ఉన్న వారికి తినడానికి తినే పదార్థాలను అందించాడు.

అంతేకాకుండా వారితో వీడియో కాల్ ద్వారా మాట్లాడుతూ వారికి కావాల్సిన సహాయాన్ని అడిగి తెలుసుకుంటున్నాడు.

ఇక ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారగా వారి సహాయాన్ని చూసి నెటిజన్లు చాలా పొగుడుతున్నారు.

మీలాంటి వాళ్లు కచ్చితంగా ఉండాలి అని కామెంట్లు పెడుతున్నారు.సీరియల్స్ కు దూరంగా ఉంటూ సమాజ సేవకు దగ్గరగా ఉంటూ మరింత అభిమానాన్ని సంపాదించుకున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube