గ్రీన్ ఇండియాకు అరుదైన ఘనత.. అంటార్కిటికాపై జెండా

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కొత్త రికార్డు సృష్టించింది.పొల్యూషన్ నుంచి పర్యావరణాన్ని రక్షించుకోవాలంటే మొక్కలను నాటి పెంచడం ఒక్కటే మార్గమని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.

 Rare Credit To Green India .. Flag Over Antarctica Green India, New Record, Late-TeluguStop.com

దీంతో ప్రభుత్వాలు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయ.మొక్కల పెంపకంపై ప్రజల్లో అవాగాహన కల్పిస్తున్నాయి.

హరితహరం లాంటి కార్యక్రమాల పేరుతో చాలా ప్రభుత్వాలు మొక్కలు నాటుతున్నాయి.ఇందులో ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నాయి.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో మొక్కలు నాటడంపై అవగాహన కల్పిస్తున్నారు.ఈ క్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సరికొత్త చరిత్ర సృష్టించింది.మంచుఖండం అంటార్కిటికాపై గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జెండా ఎగురవేశారు.35 దేశాల నుంచి 150 మంది సభ్యులతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అంటార్కిటికా ప్రయాణించింది.అంటార్కిటికా పర్యావరణం కాపాడాలనే ఉద్యమం చేపట్టిన రాబర్ట్ స్వాన్ ను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వాలంటీర్ కలిశారు.ఈ సందర్భంగా భారతదేశంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వివరాలను రాబర్ట్ స్వాన్ కు వివరించారు.

దీంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ఆయన ప్రశంసించారు.గత ఐదేళ్లుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో చేపట్టిన కార్యకర్తలు, ఇండియా గ్రీన్ ఇండియా ఉద్యమం గురించి వివరించారు.

దీనిపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.దీంతో రాబర్ట్ స్వాన్ స్వయంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జెండాను అంటార్కిటికాలో ప్రదర్శించారు.

అయితే అంటార్కిటికా యాత్రలో పాల్గొన్న వాలటీర్ అభిషేక్ శోభన్నను టీఆర్‌ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ అభినందించారు.ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

గత కొన్నేళ్లుగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో మొక్కల పెంపకంపై ప్రజలకు సంతోష్ కుమార్ అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే.కాగా ఉత్తర, దక్షిణ ధృవాలను సందర్శించి చైతన్యం చేస్తున్న వ్యక్తిగా రాబర్ట్ స్వాన్ ను ఐక్యరాజ్యసమితి గుర్తించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube