లోకేష్ పల్నాడు పర్యటన ! పోలీసుల ఆంక్షలపై గరం గరం ?

టిడిపి అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇద్దరు జనంలోనే ఉంటూ ఎన్నికల వరకు ప్రజా యాత్ర కొనసాగించేందుకు డిసైడ్ అయిపోయారు.ఇప్పటికే చంద్రబాబు జిల్లా పర్యటన చేపడుతూ, వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ, పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

 Lokesh Palnadu Tour Garam Garam On Police Sactions , Nara Lokesh , Tdp, Telugude-TeluguStop.com

ఇక మరి కొద్ది నెలల్లోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.పాదయాత్రకు ఎక్కడా బ్రేక్ రాకుండా ముందస్తు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు.

అంతకంటే ముందుగానే ఏపీ లో వివిధ సమస్యలపై జిల్లాలు, నియోజకవర్గాల వారీగా లోకేష్ పర్యటనలు చేస్తున్నారు.

దీనిలో భాగంగానే ఈ రోజు పల్నాడు జిల్లాల్లో లోకేష్ పర్యటించబోతున్నారు.

ఇటీవల హత్యకు గురైన పార్టీ నేత కంచర్ల కుటుంబ సభ్యులను రావుల పురం గ్రామం కు వెళ్లి లోకేష్ పరామర్శించనున్నారు.ఈ మేరకు గుంటూరు జిల్లా చుట్టుగుంట సెంటర్ , సత్తెనపల్లి, పిడుగురాళ్ల, కారంపూడి మీదుగా వినుకొండ నియోజకవర్గం బొల్లపల్లి మండలం రావుల పురం గ్రామం కు లోకేష్ చేరుకుంటారు.

ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి 25 లక్షల ను ఆర్థిక సాయం లోకేష్ అందించబోతున్నారు.దీంతో లోకేష్ పర్యటన పై ఉత్కంఠ నెలకొంది.లోకేష్ కు భారీ స్థాయిలో స్వాగతం పలికేందుకు పల్నాడు టిడిపి నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.అలాగే మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ని భారీ స్థాయిలో చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు.

Telugu Ap, Chandrababu, Lokesh, Telugudesam, Ysrcp-Politics

అయితే పోలీసులు మాత్రం లోకేష్ పర్యటనకు సంబంధించి ఆంక్షలు విధించారు.లోకేష్ పర్యటన సందర్భంగా ఎటువంటి ర్యాలీలు చేపట్టేందుకు అనుమతి లేదని టిడిపి నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేయడంపై, ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.తాము శాంతియుతంగా ర్యాలీ నిర్వహించుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గం అంటూ టీడీపీ శ్రేణులు ప్రకటించడంతో, పోలీసులు లోకేష్ పర్యటన ను అడ్డుకునేందుకు చూస్తున్నారట.దీంతో టిడిపి శ్రేణులు , పోలీసుల మధ్య తోపులాటలు, అరెస్ట్ లు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube