విడాకుల గురించి దర్శక నిర్మాతల దగ్గర నోరు విప్పిన సమంత.. ఏం చెప్పిందంటే?

తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని వారసుడు నాగ చైతన్య, ముద్దుగుమ్మ సమంత నటీనటులుగా తమకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్నారు.పైగా అతి తక్కువ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

 Samantha Opens Up On Divorce With Naga Chaitanya In Koffee With Karan Show Detai-TeluguStop.com

కానీ కొన్ని పరిణామాల వల్ల వీరి జీవితం మూన్నాళ్ళ ముచ్చటగా మాత్రమే మిగిలిపోయింది.ఏం జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియా వేదికగా విడిపోతున్నామని ప్రకటించారు.

కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జంట ఏ కారణం వల్ల విడిపోయారు అనేది పూర్తిగా తెలీదు.

నాలుగేళ్ల కిందట పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఈ జంట ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా నిలిచింది.

నిజానికి సమంతని చేసుకున్న తర్వాత నాగచైతన్య కూడా బాగా కలిసి వచ్చింది.పెళ్లి తర్వాత ఈ జంట పలు సినిమాలలో, యాడ్స్ లలో నటించారు.కొన్ని రియాలిటీ షోలలో కూడా పాల్గొని తమ వ్యక్తిగత కబుర్లు కూడా పంచుకున్నారు.ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఇద్దరు కలిసి ట్రిప్స్ కు వెళ్తూ బాగా ఎంజాయ్ చేశారు.

నిజానికి ఈ జంట చివరి దాకా కలిసి ఉండి ఆదర్శంగా నిలుస్తుందని అనుకున్నారు.కానీ గత ఏడాది ఏం జరిగిందో తెలియదు.సోషల్ మీడియా వేదికగా తాము విడిపోతున్నామని ప్రకటించి అందరినీ షాక్ అయ్యేలా చేశారు.కొంతమంది సమంత ప్రవర్తనలో మార్పు వచ్చిందని అందుకే విడిపోయారు అని అన్నారు.

మరికొందరు పెళ్లి జరిగి ఒక కోడలు హోదాలో ఉన్న కూడా తనకు నచ్చినట్లు మాత్రమే ఉంటుందని అన్నారు.కానీ ఇందులో ఎంత నిజముందో ఇప్పటికీ అసలు నిజం బయట పడలేదు.

Telugu Divorce, Karan Johar, Naga Chaitanya, Samantha, Samanthanaga, Telugu, Tol

మొత్తానికి ఈ జంట విడిపోయి తమ కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.పైగా వరస ప్రాజెక్టులతో ఇద్దరు ఫుల్ బిజీగా మారారు.సమంత మాత్రం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది.ఇప్పటి వరకూ సమంత తమ విడాకుల గురించి బయట పెట్టకపోగా బాలీవుడ్ లో కరణ్ జోహార్ షో లో మాత్రం అన్ని విషయాలు బయట పెట్టిందని తెలుస్తుంది.

Telugu Divorce, Karan Johar, Naga Chaitanya, Samantha, Samanthanaga, Telugu, Tol

బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ‘కాఫీ విత్ కరణ్’ అనే టాక్ షోను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు పాల్గొని తమ వ్యక్తిగత విషయాలు కూడా బయట పెట్టారు.ఇక సమంత కూడా ఈ షోలో పాల్గొననున్నట్లు గతంలో తెలిసింది.

దీంతో సమంత ఈ షోలో తన వ్యక్తిగత విషయాలు బయట పెట్టిందని.

ముఖ్యంగా తన విడాకుల గురించి కరణ్ జోహార్ కూడా అడిగే ప్రయత్నం చేశాడు అని అంటున్నారు.స‌మంత కూడా విడాకుల కార‌ణాన్ని చెప్పిందని తెలుస్తుంది.దీంతో సమంత ఏమ‌ని స‌మాధానం చెప్పిందో అని అంద‌రిలోనూ ఆస‌క్తిని రేపింది.ఇక ఈ షో జూలై 7 న డిస్నీ హాట్ స్టార్‌ లో ప్ర‌సారం కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube