దోశ పెనంతో మొసలిని చితకబాదిన వ్యక్తి.. ఫన్నీ వీడియో వైరల్..!

సాధారణంగా మొసళ్లు చాలా శక్తివంతంగా ఉంటాయి.ఇవి సింహాలు, పులులు, ఏనుగులు ఇలా ఎంత పెద్ద జంతువునైనా చంపేయగలవు.

 The Man Who Crushed The Crocodile With A Dosha Pen  Funny Video Viral  , Dosa Pa-TeluguStop.com

మనుషులను సైతం ఇవి నిమిషాల వ్యవధిలో చీల్చి చండాడగలవు.ఇలాంటి ప్రమాదకరమైన జీవి అటాక్ చేస్తే డిఫెండ్ చేయడం చాలా కష్టం.

దీన్ని తరిమికొట్టాలంటే కనీసం తుపాకీ లేదా పదునైనా కత్తి అయినా అవసరం.కానీ ఒక వ్యక్తి మాత్రం సింపుల్‌గా దోశ పెనంతో ఒక పెద్ద మొసలిని చితకబాదాడు.

దీనితో అది తోక ముడిచి కుయ్యో మొర్రో అంటూ పరారైంది.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే. ఆస్ట్రేలియాలో కై హాన్సెన్ ఒక వ్యక్తి ఒక పబ్బు అండ్ లాడ్జ్‌ను నది పక్కనే రన్ చేస్తున్నాడు.అయితే ఇటీవల తన లాడ్జిలో దిగిన కస్టమర్లు తిరిగి ఇంటికి వెళ్లాలి అనుకున్నారు.అప్పుడే కింద వారికి ఒక పెద్ద మొసలి కనిపించింది.

దీంతో బాగా హడలిపోయిన వారందరూ ” ఇప్పుడు మేము కిందికి ఎలా దిగాలి? దిగితే ఆ మొసలికి ఆహారం అవ్వాల్సిందే! అయ్యో దారుణంగా చిక్కుకుపోయామే!” అంటూ పెద్ద పెద్దగా అరవడం స్టార్ట్ చేశారు.దీంతో ఏంటి ప్రాబ్లం అంటూ హీరోలాగా రంగ ప్రవేశం చేశాడు లాడ్జి ఓనర్ కై హాన్సెన్.

ఆ తర్వాత ఒక దోశ పెనం చేత పట్టుకొని కిందికి దిగాడు.దీంతో అతడిపై అటాక్ చేసేందుకు ఆ పెద్ద మొసలి శరవేగంగా దూసుకొస్తోంది.ఇది చూస్తున్న అందరికీ గుండెలు గుబేలుమన్నాయి.తాము ఓ పెద్ద ఘోరం చూడబోతున్నామని కొందరు కళ్లు కూడా మూసుకున్నారు.

కానీ అక్కడ జరిగింది వేరు.హాన్సెన్ తన మీదకి దూసుకొచ్చిన మొసలిని దోశ పెనంతో పిచ్చి కొట్టుడు కొట్టాడు.

తలపై రెండు దెబ్బలు వేయడంతో ఆ మొసలికి దిమ్మ తిరిగినట్లయింది.వెంటనే అది తన ప్రాణాలను కాపాడుకునేందుకు మళ్లీ నదిలోకి పరిగెత్తింది.

ఈ వీడియో చూసిన నెటిజనులు చాలా ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.“అమెరికన్లు తుపాకీలు కావాలేమో కానీ ఆస్ట్రేలియన్లకు దోశ ప్యాన్‌లు చాలు, దేన్నైనా ఉరికిస్తారు.” అని ఒక నెటిజన్ కామెంట్ పెట్టాడు.వామ్మో ఇది చాలా డేంజర్ అని, ఆ వ్యక్తి చాలా ధైర్యవంతుడని, ఇది చూసేందుకు చాలా ఫన్నీగా ఉంది అని కొందరు కామెంట్ చేస్తున్నారు.

ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube