సినీ కార్మికుడి రోజు వారి కూలీ ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే

టాలీవుడ్ సినీ కార్మికులు సమ్మె కు వెళ్లబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే.కొన్ని సంఘాల వారు తమ పారితోషికంను పెంచాలి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.

 Telugu Film Employees Daily Salary , Film Employees Protest , Film News , New-TeluguStop.com

ప్రస్తుతం ఉన్న పారితోషికం ముఖ్యంగా రోజు వారి డైలీ లేబర్ కు ఇస్తున్న కూలీ ఏమాత్రం సరిపోవడం లేదు అంటున్నారు.ఈ విషయం మీడియా ల ద్వారా.

వార్తల ద్వారా చూస్తున్న వారు పాపం కూలీలకు అంత తక్కువ డబ్బు ఇస్తున్నారా.వారి జీవితం ఎలా సాగేది అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో తాజాగా ఇండస్ట్రీకి చెందిన రోజు వారి కూలీ గురించి చర్చ జరుగుతోంది.ఇంతకు వారి పారితోషికం ఎంత అనేది విచారిస్తే మాకు తెలిసిన సమాచారం ఏంటీ అంటే.

క్లీనింగ్‌ సెక్షన్ లో పాల్గొనే వారు లేదా ప్రొడక్షన్ బాయ్స్ కు రోజుకు ప్రస్తుతం 1145 రూపాయలు అందుతున్నారు.ఆ డబ్బులతో పాటు మద్యాహ్నం సమయంలో లంచ్ ఇంకా పికప్ మరియు డ్రాపింగ్‌ సౌకర్యం కూడా ఉంది.

ఇతర టెక్నీషియన్ టీమ్‌ యొక్క వర్కర్స్ కు 1500 రూపాయల వరకు రోజు వారి కూలీ ని చెల్లిస్తున్నారు.ఇప్పుడు సినీ కార్మికులు ప్రస్తుతం ఉన్న కూలీ పై 30 శాతం కూలీ ని పెంచాల్సిందే అన్నట్లుగా డిమాండ్‌ చేస్తున్నారు.

అంటే రోజు వారి కూలీ ఏ స్థాయి లో పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.ప్రస్తుతం ఉన్న కూలీ తో నెలలో 20 రోజులు వర్క్‌ చేసినా కూడా కనీసం 30 వేల రూపాయలు కూలీకి వస్తున్నాయి.

అదే పెంచినట్లయితే అది 40 వేలకు పైగానే అవుతుంది.కొన్ని గంటల పనికి అంత జీతం ఎలా చెల్లిస్తారు అనేది చాలా మంది అభిప్రాయం.

ప్రొడక్షన్ బాయ్స్ నుండి మొదలుకుని టెక్నికల్ అసిస్టెంట్స్ హెల్పర్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా జీతాలు భారీగా పెంచమంటే నిర్మాతల పరిస్థితి ఏం కావాలి అనేది చాలా మంది అభిప్రాయం.ప్రస్తుతానికి షూటింగ్ లకు అంతరాయం ఏమీ లేదు.

ముందు ముందు సమస్య జటిలం అయితే అవ్వచ్చు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube