నీటిలో తడిచినా పాడవని ఫోన్లు ఇవే

ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఫోన్ నీటిలో పడిపోతే మన ఆనందం ఆవిరై పోతుంది.వేల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోతాయి.

 These Are The Waterproof Mobiles Available In The Indian Market Details, Water P-TeluguStop.com

ఆ తర్వాత ఆ ఫోన్లు ఎందుకూ పనికి రావు.అయితే మార్కెట్‌లో కొన్ని వాటర్ ప్రూఫ్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

పొరపాటున నీటిలో పడినా, వాటిని తీసి తుడుచుకోవచ్చు.ఆ తర్వాత మామూలుగానే వాడుకోవచ్చు.

ఇటువంటి ఫోన్లు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.మన భారతదేశ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వాటర్ ప్రూఫ్ ఫోన్లు ఏంటో తెలుసుకుందాం.

పోకో ఎం4 ప్రో 5జీ

ఈ ఫోన్‌ను డస్ట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్‌గా రూపొందించారు.6.6 ఇంచ్ డిస్ ప్లేతో, 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీతో ఉండే ప్రారంభ మోడల్ ధర రూ.14,215కే లభిస్తోంది.

రెడ్‌మీ 10 ప్రైమ్ 2022

6.5 ఇంచ్ డిస్ ప్లే, 50 రియర్ కెమెరా, 8 ఫ్రంట్ కెమెరాతో ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్లు.దీనిని కూడా వాటర్ ప్రూఫ్‌గా రూపొందించారు.4జీబీ ర్యామ్, 64 ఇంటర్నల్ మెమొరీతో కూడిన ప్రారంభ మోడల్ ధర రూ.11,499గా ఉంది.

Telugu Indian, Latest, Mobiles, Moto, Oppo, Poco Pro, Redmi Prime-Latest News -

ఒప్పో కే 10

వాటర్ ప్రూఫ్ ఫోన్ కొనాలనుకునే వారికి మరో అత్యుత్తమ ప్రత్యామ్నాయం ఈ మోడల్.6.59 ఇంచ్ డిస్ ప్లేతో, 50 ఎంపీ రియర్ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ లభిస్తుంది.6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమొరీతో కూడిన ప్రారంభ మోడల్ రూ.14,990గా ఉంది.

Telugu Indian, Latest, Mobiles, Moto, Oppo, Poco Pro, Redmi Prime-Latest News -

మోటో జీ40 ఫ్యూజన్

మరో పవర్ ఫుల్ వాటర్ ప్రూఫ్ ఫోన్ ఇది.6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.8 ఇంచ్ డిస్ ప్లే, 64 ఎంపీ రియర్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటివి ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు.6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీతో కూడిన ప్రారంభ మోడల్ ధర రూ.14,499గా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube