రంజీ క్రికెట్‌లో నయా సంచలనం అర్మాన్.. భారత మాజీ క్రికెటర్‌కు మేనల్లుడు!

భారత రంజీ క్రికెట్‌లో ప్రస్తుతం అర్మాన్ జాఫర్ పేరు మార్మోగుతుంది.అంతా ఊహించినట్లుగానే, అతడిని ముంబై రంజీ టీమ్‌కు సెలెక్ట్ చేశారు.

 Armaan, The New Sensation In Ranji Cricket, Is The Nephew Of A Former Indian Cr-TeluguStop.com

ప్రస్తుతం యూపీ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై జట్టు ఆధిక్యంలో ఉండడానికి ప్రధాన కారణం అర్మాన్ జాఫర్ బ్యాటింగేనని విశ్లేషకులు భావిస్తున్నారు.గతేడాది ముంబై అండర్-23 జట్టు కోసం సౌరాష్ట్రపై ట్రిపుల్ సెంచరీ సాధించిన అర్మాన్ జాఫర్‌ సెలెక్టర్ల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాడు.

కేవలం 367 బంతుల్లో 26 ఫోర్లతో అజేయంగా 300 పరుగులు చేశాడు.అందులో 10 సిక్సర్లు ఉన్నాయి.

ఇక టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్‌కు స్వయానా మేనల్లుడు ఈ అర్మాన్ జాఫర్.ఇతడి గురించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

మూడేళ్ల క్రితం బంగ్లాదేశ్‌లో జరిగిన అండర్-19 ప్రపంచ కప్‌లో అర్మాన్ జాఫర్ గాయపడ్డాడు.రంజీ ట్రోఫీ యొక్క 2016-17 సీజన్‌లో అతను ముంబై తరపున ఆడిన మూడు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 7.33 సగటుతో అధ్వాన్న ఫామ్‌తో ఇబ్బందులు పడ్డాడు.ఆ తర్వాత పుంజుకుని బ్యాటింగ్‌లో రికార్డులు సృష్టిస్తున్నాడు.2009లో కేవలం 12 ఏళ్ల వయసులోనే స్కూల్ క్రికెట్‌లో అత్యధిక పరుగుల రికార్డును అర్మాన్ జాఫర్ తన ఖాతాలో వేసుకున్నాడు.రిజ్వీ స్ప్రింగ్‌ఫీల్డ్ స్కూల్ తరపున రాజా శివాజీ స్కూల్‌తో జరిగిన మ్యాచులో ఏకంగా 498 పరుగులు చేశాడు.

తాజాగా యూపీతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ముంబై తరుపున 127 పరుగులు చేశాడు.యశస్వి జైశ్వాల్‌తో కలిసి ఏకంగా 286 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు.ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోయినా, త్వరలోనే టీమిండియాకు సెలెక్ట్ అవుతాడనే అంచనాలున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube