ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం హాట్ హాట్ గా సాగుతుంది.రానున్న ఎన్నికల నేపథ్యంలో ఇప్పటినుంచే రాజకీయ పార్టీలు ముమ్మరంగా నువ్వా నేనా అంటూ ప్రచారాలు చేస్తున్నారు.
గెలుపే లక్ష్యంగా కీలక పార్టీ నేతలు పర్యటనలు, సమావేశాలు, సభలు నిర్వహింస్తున్నారు.ఎలాగైనా అధికారం చేపట్టాలని దిశగా అడుగులు వేస్తున్నారు రాజకీయ పార్టీ నేతలు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వచ్చే ఏడాది పాటు రాష్ట్రవ్యాప్త పర్యటనకు ప్రణాళికను ప్రకటించిన రెండు రోజుల వ్యవధిలోనే జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన పర్యటన ప్రకటించారు.దసరా పండుగ రోజున అంటే అక్టోబర్ 5వ తేదీన తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ తన బస్సు యాత్రను ప్రారంభిస్తారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
జనసేన అధినేత వచ్చే ఆరు నెలల్లో రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేసి ప్రతి ప్రధాన నియోజకవర్గాన్ని టచ్ చేయనున్నారు.రాష్ట్రంలోని అవిభాజ్య జిల్లాల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో బహిరంగ సభల్లో ఆయన ప్రసంగిస్తారు.
షెడ్యూల్ సిద్ధమవుతోంది.ప్రతి నెలా రెండు జిల్లాలు.
మూడు రోజుల్లో ఒక్కో నియోజకవర్గాన్ని కలుపుతూ నెలకు 20 రోజుల పాటు యాత్ర నిర్వహించాలని టీడీపీ అధ్యక్షుడు చంంద్రబాబు నాయుడు ప్రకటించిన తరుణంలో ఆయన కుమారుడు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా అక్టోబర్ 2 నుంచి మారథాన్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు సామాజిక న్యాయ భేరి యాత్ర నిర్వహించగా, బడుగు, బలహీన వర్గాల మంత్రులు ఇప్పటికే గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించారు.భారతీయ జనతా పార్టీ ఇంకా తమ నాయకులు రాష్ట్రంలో ఇలాంటి యాత్రలు నిర్వహించడంపై కార్యాచరణ ప్రణాళికతో ముందుకు రాలేదు.అయితే రాబోయే నెలల్లో పార్టీ ఖచ్చితంగా బహిరంగ సభలు నిర్వహించాలని కీలక పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు.