వెరైటీ టైటిల్ తో సంతోష్ శోభన్..!

కరోనా లాక్ డౌన్ టైం లో ఏక్ మిని కథ అంటూ వచ్చి సూపర్ హిట్ కొట్టాడు సంతోష్ శోభన్.మేర్లపాక గాంధి కథ అందించిన ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజై ప్రేక్షకులను అలరించింది.

 Santosh Shobhan Varity Title Merlapaka Gandhi Movie , Ek Mini Katha , Merlapak-TeluguStop.com

ఏక్ మిని కథకు కథ అందించిన మేర్లపాక గాంధి ఈసారి సంతోష్ శోభన్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.యువి కాన్సెప్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు లైక్ షేర్ సబ్ స్క్రైబర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారట.

ఇందులో హీరో యూట్యూబర్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది.

సినిమా కూడా సోషల్ మీడియా కాన్సెప్ట్ మీదే జరుగుతుందట.

వెరైటీ థం నైల్స్ పెట్టి యూట్యూబర్స్ ఎలా ఆడియెన్స్ ని మిస్ గైడ్ చేస్తారన్న పాయింట్ తో కామెడీ ఎంటర్టైనర్ గా చివర్లో ఓ మంచి మెసేజ్ తో ఈ సినిమా వస్తుందట.ముఖ్యంగా ఈ సినిమా టైటిల్ లైక్ షేర్ సబ్ స్క్రైబ్ అనేది క్రేజీగా అనిపిస్తుంది.

ఆల్రెడీ సినిమా స్టార్ట్ అయ్యి షూటింగ్ లాగించేస్తున్నారని తెలుస్తుంది.త్వరలోనే సినిమా టీజర్ తో సర్ ప్రైజ్ చేస్తారని అంటున్నారు.

యువ హీరో సంతోష్ శోభన్ ఈ సినిమాతో పాటుగా నందిని రెడ్డి డైరక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తి కావొచ్చింది.

ఇదేకాకుండా మెగా డాటర్ సుస్మిత నిర్మాణంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు సంతోష్ శోభన్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube