దివ్యవాణి మాస్టర్ ప్లాన్.. టార్గెట్ టీడీపీ

ఏపీ రాజకీయాల్లో టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి రాజీనామా వ్యవహారం రెండ్రోజులుగా హాట్ టాపిక్‌గా మారింది.రాష్ట్రంలో టీడీపీ పుంజుకుంటున్న వేళ దివ్యవాణి వ్యవహారం ఆ పార్టీకి అడ్డురాయిలా తగులుతోంది.

 Divyavani Politics About Target Telugu Desam Party Details, Divyavani, Telugu De-TeluguStop.com

తొలుత రాజీనామా చేసి.మళ్లీ వెనక్కి తీసుకుని అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబును దివ్యవాణి కలవడంతో పరిస్థితి సద్దుమణిగిందని అందరూ భావించారు.

కానీ అంతా ప్రశాంతం అనుకునే లోపే అదంతా తూచ్ అన్నట్లుగా టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు దివ్యవాణి ప్రకటించారు.

దివ్యవాణి రాజీనామాకు కారణాలు ఏవైనా ఆమె ఇప్పుడు ఏ పార్టీలో చేరతారనే విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది.

గతంలో వైసీపీపై తీవ్ర ఆరోపణలు చేసిన దివ్యవాణిని ఆ పార్టీ అక్కున చేర్చుకుంటుందా లేదో అని పలువురు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే దివ్యవాణి మాస్టర్ ప్లాన్ వేశారని.

ఆమె మంత్రి రోజా లాబీయింగ్‌తో వైసీపీలో చేరాలని చూస్తున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

ఒకవేళ దివ్యవాణి వైసీపీలో చేరితే రోజా తరహాలో ఆమె కూడా టీడీపీ నేతలను తిట్టిపోస్తారా అనే విషయంపైనా పలువురు చర్చించుకుంటున్నారు.

అయితే వైసీపీ శ్రేణులు మాత్రం ఇప్పటికిప్పుడు దివ్యవాణిని పార్టీలోకి చేర్చుకోవద్దని అధినేత జగన్‌కు పలువురు సలహాలు ఇస్తున్నారు.

Telugu Andhra Pradesh, Anil Kumar, Chandrababu, Votes, Cmjagan, Divyavani, Ka Pa

కొందరు మాత్రం ఆమె వైసీపీలో చేరితే బ్రదర్ అనిల్ కుమార్ మాదిరిగా లేదా కేఏపాల్ మాదిరిగా క్రిస్టియన్ మైనార్టీ ఓట్లను ఆకర్షిస్తారని భావిస్తున్నారు.

అయితే కొందరు టీడీపీ నేతలు తన గురించి బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నారని దివ్యవాణి మండిపడుతున్నారు.తనకు ప్యాకేజీ అందిందని కొందరు అంటున్నారుని.

అయితే తాను ప్యాకేజీ కోసమే టీడీపీకి రాజీనామా చేశానన్న ఆరోపణలు వాస్తవం కాదని క్లారిటీ ఇచ్చారు.ఏడాదిగా తనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గించారని.

మొన్నటికి మొన్న మహానాడులోనూ తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని దివ్యవాణి ఆరోపిస్తున్నారు.మొత్తానికి దివ్యవాణి వైసీపీలో చేరినా.

చేరకపోయినా ఆమె టీడీపీని టార్గెట్ చేసిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube