మేనిఫెస్టో మ‌ర్చిపోయిన బాబు.. ఎలా అంటున్న త‌మ్ముళ్లు..

మహానాడు తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన వేడుక.పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు పెద్ద పండుగ లెక్క.

 Tdp Activists Unhappy That Chandrababu Not Announced Party Manifesto In Mahanadu-TeluguStop.com

ఈ సమావేశాల్లో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను, ఏజెండాలను వివిధ సమస్యలపై తీర్మానిస్తారు.కాగా ఈ సారి మ‌హానాడుకు ఒంగోలు స‌మీపంలోని మండ‌వ‌వారి పాలెం వ‌ద్ద 80 ఎక‌రాల మైదానంలో నిర్వ‌హించారు.

శుక్ర‌, శ‌నివారాల్లో రెండు రోజుల పాటు ఈ వేడుక జ‌రిగింది.ఈ వేడుక‌కు ప్ర‌జాప్ర‌తినిధులు, నాయ‌కులు భారీగా హాజ‌ర‌య్యారు.

టీడీపీ శ్రేణులు భారీగా ఒంగోలుకు చేరుకున్నారు.స‌మావేశాల్లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా, ప్ర‌భుత్వ వ్య‌తిరేక విధానాల‌పై విసృత ప్ర‌చారం, తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బ‌లోపేతం, పార్టీ ఎజెండా వంటివి మాట్లాడ‌తార‌ని అంద‌రూ ఎదురు చూశారు.

కానీ ఇవేవి జ‌ర‌గ‌లేదు.మ‌రి ఏం జ‌రిగిందంటే జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు.

ఈ సారి మ‌హానాడులో చెప్పుకోవ‌డానికి ఇది ఒక్క‌టి మాత్ర‌మే మిగిలింది.

జ‌గ‌న్ ప్ర‌భుత్వం బాల‌య్య బాబు అఖండ సినిమాను అడ్డుకుంద‌ని.

భార‌తి సిమెంట్ కి ప‌ర్మీష‌న్ ఇచ్చింది నేనే అని చెప్పుకున్నాడు.రాజ‌ధానిగా అమ‌రావ‌తిని నిర్ణ‌యిస్తే అంతా మార్చేశార‌ని విమ‌ర్శించారు.

గ‌తంలో అమ‌రావ‌తికి మ‌ద్ద‌తు తెలిపి.అధికారంలోకి వ‌చ్చాక నిర్వీర్యం చేశార‌ని మండిప‌డ్డారు.

జ‌గ‌న్ ప్ర‌భుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశార‌ని.ఉద్యోగాలు మ‌రిచార‌ని ఎద్దేవా చేశారు.

ఇంకోటి ప్ర‌ధానంగా కార్య‌క‌ర్త‌ల‌ను కేసులు పెట్టించుకోండి మ‌న ప్ర‌భుత్వం వ‌చ్చాక ఎత్తేస్తాం అని చెప్పారు త‌ప్పితే పార్టీ మేనిఫెస్టో ఎజెండా ఎక్క‌డా ప్ర‌క‌టించ‌లేదు.

Telugu Chandrababu, Cmjagan, Lokesh, Tdp, Tdp Mahanadu, Tdp Manifesto-Political

ఇక చిన‌బాబు కూడా జ‌గ‌న్ పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.చంద్ర‌బాబు రాముడ‌ని.జ‌గ‌న్ రాక్ష‌సుడ‌ని అన్నాడు.

క‌నీసం వ‌చ్చే ఎల‌క్ష‌న్ల‌లో పోటీ చేసే కొన్ని సీట్ల అభ్య‌ర్తుల‌నైనా ప్ర‌కటిస్తార‌ని ఎదురు చూసినా దాని ఊసే తీయ‌లేదు.పైగా మ‌హానాడు వేడుక సంద‌ర్భంగా చిన‌బాబు సీనియ‌ర్లు, దీర్ఘ‌కాల ప‌ద‌వులు చేప‌ట్టినోళ్ల‌కు షాక్ ఇచ్చారు.

పొత్తుల‌పై కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.దీంతో తెలుగు త‌మ్ముళ్లు కూడా ఫీల‌వుతున్నారు.

అధికారం ప‌క్షం కూడా అధికారంలోకి వ‌స్తే ఏం చేస్తారో చేప్ప‌లేద‌ని విమ‌ర్శించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube