Axis Bank ఖాతాదారులకు ఝలక్... సర్వీస్ ఛార్జీలపై మోత షురూ!

మీరు Axis Bank ఖాతాదారులైతే, ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి.ఇకనుండి బ్యాంకింగ్ సేవల ఛార్జీలను పెంచుతున్నట్లు తాజాగా నిర్ణయించింది.

 Axis Bank Hikes Service Charges For Savings And Salary Accounts-TeluguStop.com

ఇక పెరిగిన ఛార్జీలు జూన్1,2022 నుంచి అమలులోకి రానున్నాయని సమాచారం.మినిమం బ్యాలెన్స్, NACH డెబిట్ మరియు ఆటో డెబిట్ ఫెయిల్యూర్, చెక్ బుక్ ఛార్జీలను పెంచుతూ ఈ నిర్ణయం తీసుకుంది.

దాంతో వినియోగదారులు జూన్ నుంచి నెలవారీ యావరేజ్ బ్యాలెన్స్ తప్పక మెయింటెన్ చేయాల్సిన పరిస్థితి ఉంది.లేదంటే ఇక మోత తప్పదు.

ఇక ఛార్జుల విషయం ఒకసారి పరిశీలించినట్లయితే.సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు పెంచింది.ఒకవేళ ఛార్జీలు వర్తించకుండా ఉండాలంటే లక్ష రూపాయలు టర్మ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.గ్రామీణ సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంక్ ఖాతాల్లో క్వార్టర్లీ బ్యాలెన్స్ సగటున రూ.15 వేలు లేదా రూ.లక్ష డిపాజిట్ వరకు ఉంటుందని కంపెనీ వెల్లడించింది.లిబర్టీ ఖాతాలకు ఇది రూ.25 వేలుగా ఉంది.ఒకవేళ ఈ బ్యాలెన్స్ రూల్స్ పాటించకపోతే.మెట్రో/అర్బన్ ప్రాంతాల్లో రూ.500 నుంచి రూ.600, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.300, గ్రామీణ ప్రాంతాల్లో రూ.250 ఛార్జీలు ఉంటాయని బ్యాంక్ తన వెబ్ సైట్ లో తెలిపింది.

Telugu Ais Bank, Axis Bank, Axisbank, Cheque-Latest News - Telugu

ఇకపోతే, ఈ ఛార్జీలు గతంలో కంటే 7.5 శాతం మేర పెంచబడ్డాయి.ప్రైమ్, లిబర్టీ కింద ఉన్న అన్ని పొదుపు ఖాతాలకు ఇది వర్తిస్తుంది.మొదటి 5 లావాదేవీలు లేదా రూ.1.5 లక్షలు (ఏది ముందైతే అది) కస్టమర్లు ఉచితంగా పొందవచ్చు.ఇంతకు ముందు ఆ పరిమితి మొదటి 5 లావాదేవీలు లేదా రూ.2 లక్షలు (ఏది ముందైతే అది)గా ఉండేది.ఆటో డెబిట్ ఫెయిల్యూర్, స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్ రిజెక్షన్ ఛార్జీలు ఒక ఫెయిల్యూర్‌కు ఇంతకు ముందు ఉన్న రూ.200 నుంచి రూ.250 పెంచబడ్డాయి.దీనికి తోడు క్యాష్ రీసైక్లర్, డిపాజిట్ మెషిన్లలో సాయంత్రం 5 నుంచి మరుసటి రోజు ఉదయం 9.30 మధ్య చేసే లావాదేవీకి రూ.50 ఛార్జీగా చెల్లించాల్సి ఉంటుందని బ్యాంక్ తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube