యూఎస్ లో మ్యాజిక్ చేస్తున్న ఎఫ్ 3.. ఏకంగా ఆ మార్క్ టచ్ చేసి షాక్ ఇచ్చింది..

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా ‘ఎఫ్ 3’.ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా వచ్చింది.

 F3 Movie Collections Usa Box Office, F3 Movie, Anil Ravipudi, Venkatesh, Varun T-TeluguStop.com

ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అనిల్ ఎఫ్ 3 సినిమాను కూడా చేసాడు.ఈ సినిమా ఈ నెల 27న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

ఇందులో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు.వీరిద్దరికి జోడీగా తమన్నా భాటియా, మెహ్రీన్ నటిస్తున్నారు.

దేవిశ్రీ సంగీతం అందించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో ఈ సినిమాను శిరీష్ నిర్మించారు.ఇక ఈ సినిమా తొలిరోజు నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

దీంతో చాలా ఏరియాల్లో హౌస్ ఫుల్ అయ్యాయి.ఫస్ట్ డే నే ఈ సినిమా 10.37 కోట్ల షేర్ రాబట్టింది అంటూ మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.ఇక ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా మ్యాజిక్ క్రియేట్ చేస్తుంది.

Telugu Anil Ravipudi, Usa Box, Varun Tej, Venkatesh-Movie

మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.దీంతో అక్కడ కూడా ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరధం పడుతున్నారు.టాక్ కు తగ్గట్టుగానే ఈ సినిమా అక్కడ సాలిడ్ వసూళ్లను అనుకుంటున్నట్టు తెలుస్తుంది.మొదటి రోజే 10 కోట్లు క్రాస్ చేసిన ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా హాఫ్ మిలియన్ వసూలు చేసింది.

ఇక రెండు రోజుల్లో ఈ సంఖ్య భారీగా పెరిగింది.దీంతో యూఎస్ లో ఈ సినిమా రెండు రోజుల్లోనే సాలిడ్ నెంబర్ ను నమోదు చేసింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా అక్కడ 7 లక్షల 50 వేల డాలర్ల మార్క్ టచ్ చేసిందట.మరి అక్కడ రెండు రోజుల్లోనే ఈ మార్క్ టచ్ చేయడం విశేషం.

ఈ సినిమాలో సునీల్, సోనాల్ చౌహన్ లు కూడా నటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube