జపాన్‌: భారత సంతతి స్కూల్స్‌లో పాపులర్ భాషల జాబితాలో హిందీకి ప్లేస్..!!!

టోక్యోలోని గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ (జీఐఐఎస్) క్యాంపస్‌లలో హిందీ, ఫ్రెంచ్‌లు అత్యంత ప్రజాదరణ పొందిన విదేశీ భాషలుగా నిలిచాయి.ఈ మేరకు విద్యా వేత్త అతుల్ తెముర్నికర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

 Hindi, French Among Most Popular Languages Among Japanese Students At Indian-ori-TeluguStop.com

ఆరు దేశాలలో జీఐఐఎస్ క్యాంపస్‌లను నిర్వహిస్తున్న సింగపూర్‌లోని గ్లోబల్ స్కూల్స్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడిగా, ఛైర్మన్‌గా అతుల్ వ్యవహరిస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.జపాన్ విద్యార్ధులు తమ సొంత సంస్కృతిని కాపాడుకుంటూ ఆసియా, పాశ్చాత్య సంస్కృతులలో ఉత్తమమైన వాటిని కూడా ఆదరిస్తున్నారని ఆయన చెప్పారు.16 క్యాంపస్‌లలో 15000కు పైగా విద్యార్ధులను కలిగిన జీఐఐఎస్‌లో భాషా అభ్యాసం, పాఠ్యాంశాలపైనా తాము దృష్టి పెట్టినట్లు అతుల్ వెల్లడించారు.ప్రపంచవ్యాప్తంగా వున్న 30 మిలియన్ల మంది భారతీయ ప్రవాసుల సాంస్కృతిక గుర్తింపులో హిందీ భాగమైందని ఆయన చెప్పారు.

కాగా.

ఈ వారం ప్రారంభంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం జపాన్‌కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీని జీఐఐఎస్‌కి చెందిన గ్రేడ్ Vకి చెందిన జపాన్ విద్యార్ధి హిందీలో పలకరించిన విషయాన్ని అతుల్ గుర్తుచేశారు.రిత్సుకీ కొబయాషి అనే చిన్నారి హిందీలో మాట్లాడటంతో పాటు.

హిందీ, జపనీస్, ఇంగ్లీష్‌లలో డిస్క్రిప్షన్‌లు వున్న తన డ్రాయింగ్‌పై మోడీ నుంచి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు.

Telugu Japanese, Frenchpopular, Hindi, Indianorigin, Primenarendra-Telugu NRI

జపనీస్ విద్యార్ధులకు హిందీ ఒక ఎంపికగా మారిందని అలాగే.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ , కేంబ్రిడ్జి ఐజీసీఎస్ఈ సిలబస్‌లలో 1 నుంచి పదవ తరగతి వరకు దానిని బోధిస్తామని అతుల్ తెలిపారు.టోక్యోలోని జీఐఐఎస్ క్యాంపస్‌లలో 19 దేశాలకు చెందిన విద్యార్ధులు వున్నట్లు అంచనా.

ఇక్కడ జపనీయులే అత్యధికం.ఈ విద్యాసంస్థలోని విద్యార్ధులు హిందీ, ఫ్రెంచ్, జపనీస్, సంస్కృతం, మాండరిన్, అరబిక్, తమిళం సహా 10 భాషలను నేర్చుకుంటున్నారు.

ఇక్కడ క్రమం తప్పకుండా హిందీ దివాస్, భాషా ఉత్సవాలు, చర్చలు, పోటీలు నిర్వహిస్తామని అతుల్ తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube