డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ కి క్లీన్ చిట్.. ఆర్యన్ అమాయకుడు: ఎన్సీబీ

గత ఏడాది అక్టోబర్ నెలలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంగతి మనకు తెలిసిందే.క్రూయిజర్ రేవ్ పార్టీ పై ఎన్సీబీ అధికారులు దాడి చేస్తూ ఆర్యన్ ఖాన్ నుడ్రగ్స్ కేసులో భాగంగా అరెస్టు చేశారు.

 Clean Chit To Aryan Khan In Drugs Case By Ncb Details, Aryan Khan, Bollywood, Dr-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ కేసు విచారణలో భాగంగా ఎన్సీబీ అధికారులు ఆర్యన్ ఖాన్ ను సుమారు నెల రోజుల పాటు తమ కస్టడీలో ఉంచుకున్నారు.పలు సార్లు బెయిల్ కోసం ప్రయత్నించిన కోర్టు విచారణ పేరుతో బెయిల్ రద్దు చేస్తూ వచ్చారు.

ఇకపోతే తాజాగా మరోసారి ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చింది.ఆర్యన్ ఖాన్ పై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఛార్జిషీట్‌ను కోర్టులో ప్రవేశపెట్టింది.ఈ క్రమంలోనే ఈ చార్జిషీట్లో భాగంగా ఎన్సీబీ అధికారులు ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్ ఇచ్చింది.ఆర్యన్ ఖాన్ అమాయకుడని.

అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అధికారులు వెల్లడించారు.ఈ క్రమంలోనే కోర్టుకు అధికారులు సమర్పించిన చార్జిషీట్లో ఆర్యన్ పేరు లేకపోవడం గమనార్హం.

Telugu Aryan Khan, Aryankhan, Bollywood, Drugs, Sharukh Khan-Movie

ఇక ఆర్యన్ ఖాన్ తో పాటు అరెస్టయిన మరో ఐదుగురికి సంబంధించి కూడా ఏ విధమైనటువంటి ఆధారాలు దొరకలేదని అధికారులు ఈ చార్జిషీట్లో పేర్కొన్నారు.ఇలా ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా ఆర్యన్ ఖాన్ ను అధికారులు తమ కస్టడీలో ఉంచి ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని పలువురు ఆరోపణలు చేస్తున్నారు.ఇకపోతే అప్పట్లో ఆర్యన్ ఖాన్ అరెస్టయిన విషయం బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.ఈ క్రమంలోనే ఆర్యన్ ఎలాంటి తప్పు చేసి ఉండరని కొందరు ఉద్దేశపూర్వకంగానే తనను ఇరికించారని కొందరు అప్పట్లో ఆర్యన్ కి మద్దతు పలికారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube