50 మంది సిట్టింగులకు టిక్కెట్లు గోవిందా..?

ఏపీలో వైసీపీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి పలు చోట్ల ప్రజల నుంచి స్వాగతాలు లభిస్తుండగా మరికొన్ని చోట్ల ఎదురుగాలి వీస్తోంది.ఈ కార్యక్రమానికి వస్తున్న ఎక్కువ శాతం మంది నేతలను ప్రజలు నిలదీసే పరిస్థితులు నెలకొన్నాయి.

 50 Percent Sitting Mla's Did Not Get Seats In Coming Elections Andhra Pradesh, Y-TeluguStop.com

దీంతో తమ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎంత పాజిటివిటీ ఉంది, ఎంత నెగిటివిటీ ఉందో వైసీపీ నేతలకు స్పష్టమైంది.ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలో కూడా అధిష్టానానికి క్లారిటీ వచ్చిందనే టాక్ వినిపిస్తోంది.

దీంతో ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇవ్వకూడదని సీఎం జగన్ భావిస్తున్నారు.ఈ జాబితాలో దాదాపు 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేల వరకు ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాలను గెలుచుకుంది.అంటే వీరిలో దాదాపు 50 మందికి మళ్లీ సీట్లు దక్కవని తెలుస్తోంది.

ఒకవేళ వీరికి కనుక టికెట్లు ఇస్తే కచ్చితంగా ఓడిపోతారని నివేదికలు చెప్తున్నాయని.తద్వారా పార్టీకి నష్టం చేకూరుతుందని వైసీపీ అధిష్టానం భావిస్తోంది.

Telugu Amaravthi, Andhra Pradesh, Ap Poltics, Gadapagadapaku, Guntur, Krishna, M

ఎక్కువగా అమరావతి రాజధాని ప్రాంతం ఉన్న గుంటూరు, కృష్ణా జిల్లాలలో వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందనే విషయం స్పష్టమవుతోంది.వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటుతున్నా రాజధాని విషయంలో వైసీపీ రెండు పడవలపై కాళ్లు వేసిన చందాన వ్యవహరిస్తుండటం మైనస్‌గా మారింది.మరోవైపు గోదావరి జిల్లాలలో కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఎదురుగాలి వీస్తోంది.దీంతో ఉభయ గోదావరి జిల్లాలలో కూడా పాత వారి స్థానంలో కొత్త వారిని తీసుకువచ్చేందుకు పావులు కదుపుతోంది.

అటు జగన్ ప్రభుత్వం నూతన రాజధాని ఏర్పాటు చేయాలని భావిస్తున్న విశాఖలోనూ వైసీపీకి అనుకూల పరిస్థితులు కనిపించడం లేదు.అక్కడి వర్గ విభేదాలు వైసీపీని దెబ్బతీస్తున్నాయనే రూమర్ వినిపిస్తోంది.

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలోనూ ఎక్కువ మంది సిట్టింగులకు మరోసారి అవకాశం రాకపోవచ్చని తెలుస్తోంది.ఏదేమైనా దాదాపు 40 శాతం ఎమ్మెల్యేలకు సీటు దక్కడం అనుమానంగానే మారిందని వార్తలు వస్తుండటంతో ఇప్పటి నుంచే పలువురు వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube