విశ్వం గుట్టును బయట పెడుతున్న ఓ గులకరాయి.. అదెలాగంటే..?!

ఒక చిన్న గులకరాయి అనంతమైన విశ్వం గుట్టు రట్టు చేస్తుందంటే నమ్ముతారా.నమ్మి తీరాల్సిందే.

 A Pebble Exposing The Universe  , Universal , Stone , Viral , Scientific Researc-TeluguStop.com

ఎందుకంటే ఈజిప్ట్ లో దొరికిన ఒక గులకరాయి విశ్వం నుంచి భూమి మీద పడింది.విశేషమేమంటే ఈ రాయి సౌర వ్యవస్థ కి చెందినది కాదు.

అంటే ఎంత దూరం నుంచి ఇది భూమి మీదకు వచ్చి పడిందో అర్థం చేసుకోవచ్చు.అలాగే దీని వయసు కూడా కోట్ల సంవత్సరాలు ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

సౌర వ్యవస్థను పుట్టకముందే ఈ రాయి ఏర్పడిందని అంటున్నారు.

ఈజిప్ట్ దేశంలోని నైరుతి భాగంలో జొహన్నెస్‌బర్గ్‌ యూనివర్శిటీ రీసెర్చర్లు 2013లో ఈ రాయిని గుర్తించారు.

ఈ గులకరాయి చాలా వింతగా ఉండటంతో దీన్ని పరిశోధకులు ల్యాబ్ కి తీసుకెళ్లి టెస్ట్ చేశారు.అయితే తాజాగా టెస్టులు అన్నీ పూర్తయ్యాయి.అప్పుడే వారికి విశ్వం లో జరిగిన ఒక భారీ పేలుడు వల్ల ఈ రాయి కింద పడింది అని తెలిసింది.తోకచుక్క లేదా ఉల్క వల్ల ఈ రాయి రాలేదని.

నక్షత్రంలో విస్పోటనం వల్ల ఇది వచ్చిందని పేర్కొన్నారు.అలాగే ఈ రాయి హైపాటియా అనే శిలకు సంబంధించినదని శాస్త్రవేత్తలు గుర్తించారు.

Telugu Egypt, Stone-Latest News - Telugu

విశ్వంలో భారీ విస్పోటనం వల్ల ఏర్పడిన ఈ హైపాటియా రాయిలో మన సౌరవ్యవస్థలో ఎక్కడా దొరకని నికెల్‌ ఫాస్పైడ్‌ను కనుగొన్నారు.ఈ పదార్థం పై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.ప్రోటాన్‌ మైక్రోప్రోబ్‌ పద్ధతిని వాడి ఈ గ్రహాంతర గులకరాయిలో 15 డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.విశ్వంలో ఏం జరిగింది, జరుగుతుందనేది ఈ రాయి ద్వారా తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఏది ఏమైనా ఎక్కడో తెలియని ప్రాంతం నుంచి ఇక్కడికి ప్రయాణించిన ఈ గులకరాయి గురించి తెలుసుకొని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube