మెగాఫ్యాన్స్ ను ఉద్దేశించి ఆ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ చేస్తున్న బన్నీ ఫ్యాన్స్.. కోపం వచ్చేలా?

ఒకప్పుడు మెగా అభిమనులు, బన్నీ అభిమానులు వేర్వేరుగా ఉండేవారు కాదు.అయితే కొన్నేళ్ల క్రితం బన్నీ చెప్పను బ్రదర్ అంటూ చేసిన కామెంట్ల వల్ల మెగా ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ వేరయ్యారు.

 Bunny Fans Trendig Hash Tag Details Here Goes Viral ,  Bunny Fans ,  Hashtag Tre-TeluguStop.com

తాజాగా విజయవాడలో మెగా అభిమానుల ఆత్మీయ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే.అయితే ఈ ఫ్యాన్స్ మీట్ వల్ల జరిగిన మంచి కంటే నష్టమే ఎక్కువని కామెంట్లు వినిపిస్తున్నాయి.

చిరంజీవి, పవన్ కళ్యాణ్, చరణ్ అభిమానులు మాత్రమే మెగా అభిమానులు అనేలా ఈ మీటింగ్ జరిగింది.

ఈ మీటింగ్ లో బన్నీకి వ్యతిరేకంగా కామెంట్లు చేయడంతో పాటు మెగా ఫ్యాన్స్ బన్నీ పల్లకి మోయాల్సిన అవసరం లేదని కామెంట్లు వినిపించాయి.అయితే ఈ విషయం తమ దృష్టికి రావడంతో బన్నీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ‘ఏం పీకలేరు బ్రదర్’ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ చేస్తుండటం గమనార్హం.1,22,000 ట్వీట్లతో ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతుండగా ఇతర హీరోల అభిమానుల నుంచి కూడా బన్నీ ఫ్యాన్స్ కు సపోర్ట్ లభిస్తోంది.

బన్నీ గురించి తప్పుగా మాట్లాడిన వ్యక్తి చనిపోయారనే విధంగా బన్నీ ఫ్యాన్స్ ప్రచారం చేస్తుండటం గమనార్హం.మెగా ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా జరిగిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మెగా ఫ్యాన్స్ బన్నీ ఫ్యాన్స్ ను కూడా కలుపుకుంటే మంచిదని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఫ్యాన్స్ మధ్య చీలిక రావడం వల్ల జనసేన పార్టీకి కూడా నష్టమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Telugu Allu Arjun, Bunny Fans, Charan, Chiranjeevi, Hashtag, Janasena, Fans, Paw

ప్రస్తుతం బన్నీ వరుస ఇండస్ట్రీ హిట్లతో కెరీర్ ను కొనసాగిస్తున్నారు.నార్త్ లో కూడా బన్నీకి భారీ స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే.మెగా ఫ్యాన్స్ మధ్య గ్యాప్ వల్లే ఆచార్య సినిమాకు నష్టం జరిగిందని కామెంట్లు వినిపించాయి.మెగా హీరోలు జోక్యం చేసుకుని అభిమానుల మధ్య చీలికలు రాకుండా జాగ్రత్త పడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube