తమ్ముడికి హిట్ ఇస్తే అన్నయ్య ఛాన్స్ ఇచ్చాడా..!

బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో కెరియర్ లో మొదటి కమర్షియల్ హిట్ అందుకున్నాడు అఖిల్ అక్కినేని.బొమ్మరిల్లు, పరుగు సినిమాల హిట్ తో టాలీవుడ్ లో తనకంటూ ఒక మార్క్ ఏర్పరచుకున్న బొమ్మరిల్లు భాస్కర్ ఆ తర్వాత చేసిన ఆరెంజ్, ఒంగోలు గిత్త, బెంగళూరు నాట్ కల్ సినిమాలు నిరాశపరచాయి.

 Naga Chaitanya Bommarillu Bhaskar Movie Is On Cards,naga Chaitanya,bommarillu Bh-TeluguStop.com

చాలా ఏళ్లుగా ఖాళీగా ఉండి ఫైనల్ గా గీతా ఆర్ట్స్ లో బ్యాచిలర్ సినిమా ఛాన్స్ అందుకున్నాడు.అఖిల్, పూజా హెగ్దేలు జోడీగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా సక్సెస్ అయ్యింది.

ఇక తమ్ముడికి హిట్ ఇవ్వడంతో ఇప్పుడు అన్నయ్య కూడా బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమాకు రెడీ అవుతున్నాడని తెలుస్తుంది.నాగ చైతన్య, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో సినిమా రాబోతుందని టాక్.

ప్రస్తుతం విక్రం కె కుమార్ డైరక్షన్ లో థ్యాంక్ యు సినిమా చేస్తున్న నాగ చైతన్య అదే విక్రం కుమార్ డైరక్షన్ లో దూత అనే వెబ్ సీరీస్ చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత సర్కారు వారి పాట డైరక్టర్ పరశురాం తో ఓ సినిమా ఉందని తెలుస్తుంది.

ఆ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమా ఉంటుందని అంటున్నారు.మొత్తానికి వెయిట్ చేసినా నాగ చైతన్యతో సినిమా చేసి మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు నాగ చైతన్య.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube