వరుసగా దగ్ధమౌతున్న ఎలక్ట్రిక్‌ వాహనాలు... DRDO నివేదికలో షాకింగ్ విషయాలు!

ఎలక్ట్రిక్ స్కూటర్లు.ఈమధ్య పెట్రో, డీజిల్ ధరలు మండిపోతున్నవేళ ఈ- మోటార్ సైకిళ్ల వినియోగం కాస్త పెరిగింది.

 వరుసగా దగ్ధమౌతున్న ఎలక్ట్రిక-TeluguStop.com

ఈ క్రమంలోనే 2030 నాటికి ఎలెక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని 100% చేర్చాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.అందుకే నేటివరకు పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో కేంద్రం సైలెంట్ గానే వుంది.

ఇక ఎలక్ట్రిక్ వాహనానికి రిజిస్ట్రేషన్ ఫ్రీ, సబ్సిడీ వంటి అవకాశాలను కేంద్రం కల్పించడం కూడా తెలిసినదే.ఈ నేపథ్యంలో వాహనదారులు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపారు.

ఇక్కడే మొదలైంది అసలు ట్విస్ట్.

ఇక ఆయిల్ రేట్స్ పెరగడం, వాహనదారులు ఈ- మోటార్ సైకిళ్ల వైపు మొగ్గు చూపుతున్న వేళ, సదరు ఎలెక్ట్రిక్ వాహనాల కంపెనీలు అనేక మోటార్ సైకిళ్లను మార్కెట్లోకి దించాయి.

మన హైదరాబాద్ లోనే సుమారు ఐదారు కంపెనీలు వాహనాలను తయారు చేసాయి.అయితే సదరు వాహనాలను 10 మంది కొనుగోలు చేస్తే, అందులో రెండు నుండి మూడు వాహనాలు కాలిపోవడం మనం చూసాం.

ఎలక్ట్రిక్ వాహనాల్లో ఒక్కసారిగా మంటలు వ్యాపిస్తుండటంతో పాటు ఛార్జింగ్ సమయంలో బ్యాటరీలు పేలడం వంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి.

Telugu Drdo, Errors Battery, Latest-Latest News - Telugu

ఈ క్రమంలో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు.ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి.వరుసగా ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు వ్యాపించి దగ్దమైన ఘటనలు చోటు చేసుకోవటంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దర్యాప్తుకు ఆదేశించారు.DRDO (భారత రక్షణ పరిశోధన సంస్థ) ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు ఎందుకు చెలరేగుతున్నాయనే అంశాలపై విచారణ చేపట్టింది.ఈ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఎలక్ట్రిక్ వాహనాలు దగ్దం కావడానికి బ్యాటరీలో లోపాల కారణంగానే వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని నివేదికలో పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube