విచిత్ర సోదరులు సినిమాలో కమల్ హాసన్ పొట్టిగా కనిపించడానికి ఇంతలా కష్టపడ్డారా?

సినిమాల కోసం ఎంతగానో కష్టపడే స్టార్ హీరోలలో కమల్ హాసన్ ఒకరనే సంగతి తెలిసిందే.విచిత్ర సోదరులు అనే సినిమాలో కమల్ హాసన్ పొట్టిగా కనిపించడానికి ఎంతో కష్టపడ్డారు.

 Interesting Facts About Kamal Hassan Vichitra Sodarulu Movie  Vichitra Sodarulu,-TeluguStop.com

సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ఒక సందర్భంలో సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.అమావాస్య చంద్రుడు సినిమా పూర్తైన తర్వాత తమ కాంబినేషన్ లో మరో మూవీ వస్తే బాగుంటుందని అనుకున్నామని ఆయన అన్నారు.

ఆ తర్వాత సినిమాను తానే నిర్మిస్తానని కమల్ హాసన్ చెప్పడంతో పాటు సినిమాకు సంబంధించిన ఐడియాను కమల్ ఇచ్చారని ఆయన చెప్పుకొచ్చారు.మొదట అనుకున్న స్టోరీ ప్రకారం సినిమాలో పొట్టివాడి పాత్ర ఇద్దరు అమ్మాయిలను ప్రేమిస్తుందని అయితే వాళ్లిద్దరూ అతడిని ప్రేమించరని క్లైమాక్స్ లో ఆ విషయం తెలిసి హీరో బాధపడతాడని సింగీతం శ్రీనివాసరావు కామెంట్లు చేశారు.

ఈ కథతో షూటింగ్ ను మొదలుపెట్టి ఐదు రోజుల పాటు షూటింగ్ ను పూర్తి చేశామని అయితే స్టార్ ప్రొడ్యూసర్ పంజు అరుణాచలం ఈ కథ కమల్ కు సూట్ కాదని కథలో పగ, ప్రతీకారాలు ఉండాలని చెప్పారని సింగీతం శ్రీనివాసరావు వెల్లడించారు.ఆయన చెప్పిన విధంగా స్టోరీలో మార్పులు చేశామని అయితే కమల్ ను పొట్టివాడిగా చూపించడం అత్యంత కష్టమైన విషయమని సింగీతం శ్రీనివాసరావు అన్నారు.

Telugu Closeup, Kamal Hasan, Tollywood-Movie

కొన్ని సీన్లలో కమల్ నడుము వరకు క్లోజప్ షాట్లను తీశామని 18 అంగుళాల స్పెషల్ షూను తొడిగించి స్క్రీన్ పై కమల్ ను పొట్టివాడిగా చూపించామని ఆయన వెల్లడించారు.కమల్ ను నేలపై చూపించే సమయంలో కాళ్లను భూమిలో పాతి పెట్టేవాళ్లమని ఆయన చెప్పుకొచ్చారు.జపాన్ అనే సెట్ బాయ్ ఈ విషయాలను చూసుకునేవారని ఆయన కామెంట్లు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube