సినిమాని తలపించేలా : సౌదీ లో భారతీయుడికి మరణ శిక్ష...క్లైమాక్స్ లో ఏమయ్యిందంటే..!!!

ఒక వ్యక్తి తన సొంత దేశం వదిలి ఉద్యోగం కోసం పొరుగు దేశం వెళ్తాడు.అలా పొట్ట కూటి కోసం వెళ్ళిన వ్యక్తి ఊహించని విధంగా అక్కడ జరిగిన మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు.

 Locals Collect Rs 2 Cr For Blood Money To Save Punjab Youth From Execution In Sa-TeluguStop.com

అతడిని కాపాడాలంటే భారీగా నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది.ఈ సమయంలో అతడి కోసం అతడి ఊరి ప్రజలు, అతడి దేశం ఏం చేసింది అన్నట్టుగా ఓ సినిమాటిక్ స్టొరీలా సాగిన ఓ భారతీయుడి యదార్ధ కధ ఇది.ఉద్వేగభరితంగా సాగిన ఈ నిజమైన కధ భారతీయుల అందరిని ఐకమత్యాన్ని, మనుషుల మధ్య ఇంకా మానవత్వం మిగిలి ఉందని నిరూపించింది.వివరాలలోకి వెళ్తే.

పంజాబ్ కి చెందిన బల్వీందర్ సింగ్ ఉపాది కోసం కుటుంబాన్ని విడిచి మరీ సౌదీ కి వెళ్ళాడు.కొన్నాళ్ళకు 2013 లో స్థానికంగా ఆన్న వ్యక్తికి బల్వీందర్ సింగ్ కు మధ్య జరిగిన గొడవలో బల్వీందర్ గట్టిగా తోయడంతో కింద పడిపోయిన వ్యక్తి అనుకోకుండా మృతి చెందాడు.

అయితే ఈ ఘటన జరిగిన సమయంలో బల్వీందర్ తప్పులేదని చుట్టుపక్కల వారు పోలీసులకు చెప్పినా బల్వీందర్ తో జరిగిన గొడవ కారణంగానే అతడు మృతి చెందడంతో అరెస్ట్ చేసారు పోలీసులు.ఈ ఘటనపై విచారణ చేపట్టిన కోర్టు బల్వీందర్ కు ఉరి శిక్ష ను ఖరారు చేసింది.

దాంతో పంజాబ్ లో ఉన్న అతడి కుటుంభ సభ్యులు, స్థానిక పంజాబ్ వాసులు ఆందోళన వ్యక్తం చేసారు.ఎలాగైనా అతడిని విడిపించాలాని కోర్టును క్షమాభిక్ష పెట్టాలంటూ కోరారు.వారి అభ్యర్ధన విన్న న్యాయస్థానం మరణించిన వ్యక్తికి రూ.2 కోట్లు చెల్లించితే క్షమాభిక్షతో పాటు అతడిని విడుదల చేస్తామని నిర్ణీత గడువుతో తీర్పు చెప్పింది.

కానీ పొట్ట చేత బట్టుకుని దేశం విడిచి పరాయి దేశం వచ్చిన కుటుంభానికి అంత పెద్ద మొత్తం తలకు మించిన భారమే దాంతో ఏం చేయాలో తెలియక బల్వీందర్ సింగ్ ను రక్షించాలంటూ కుటుంభ సభ్యులు విరాళాలు సేకరించడం మొదలు పెట్టారు.ఈ క్రమంలోనే పంజాబ్ లోని శిరోమణి గురుద్వార్ ప్రభంధక్ సమితి విరాళాల సేకరణలో కీలకంగా వ్యవహరించింది పెద్ద ఎత్తున విరాళాలు స్థానిక ప్రజలు పంజాబ్ రాష్ట్ర ప్రజలు సేకరించారు.

ప్రభుత్వం కూడా అతడి కుటుంబానికి సాయం అందించింది.దాంతో కోర్టుకు రూ.2 కోట్లు అందించడంతో బల్వీందర్ సింగ్ ఎట్టకేలకు మరణ శిక్ష నుంచీ బయటపడ్డాడు.అతి త్వరలోనే జైలు నుంచీ విడుదలయ్యి పంజాబ్ చేరుకుంటాడని అతడి కుటుంభ సభ్యులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube