భీమ్లా నాయక్ ఈవెంట్ కు బండ్ల గణేష్ రాకుండా కుట్ర జరిగిందా.. లైవ్ లో సుమ చెప్పిన విషయాలివే!

టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఆడియోలు సోషల్ మీడియాలో ఇంత వైరల్ అయ్యాయో మనందరికి తెలిసిందే.భీమ్లా నాయక్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తున్నారా లేదా అని ఒక అభిమాని బండ్ల గణేష్ ను ప్రశ్నించగా.

 Bandla Ganesh Was Stopped From Attending Bheemla Event Says Anchor Suma, F3 Movi-TeluguStop.com

అప్పుడు బండ్లగణేష్ దర్శకుడు త్రివిక్రమ్ నన్ను ఈవెంట్ కు రానివ్వడం లేదు అంటూ కామెంట్స్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే.

అయితే ఈ విషయం అంతా సద్దుమణిగింది అనుకుంటూ ఉంటే తాజాగా ఎఫ్ 3 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ సుమ ఈ వ్యవహారాన్ని మరొకసారి తెరపైకి తీసుకువచ్చింది.

అసలు విషయంలోకి.దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం లో వరుణ్ తేజ్, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన తాజా చిత్రం ఎఫ్ 3.ఈ సినిమా ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా ఆ ఈవెంట్ కు సుమ హోస్ట్ గా వ్యవహరించింది.ఈ క్రమంలోనే సుమ బండ్ల గణేష్ భీమ్లా నాయక్ సినిమా కుట్ర విషయాన్ని బయట పెట్టేసింది.

Telugu Anchor Suma, Bandla Ganesh, Bheemla Nayak, Tollywood-Movie

పూర్తి స్థాయి తెలంగాణ యాసలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అంతా నడిపించిన సుమ భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బండ్ల గణేష్ గారిని ఎలా అయితే వెళ్లకుండా కుట్ర చేశారో, తనను కూడా ఎఫ్ 3 రిలీజ్ ఈవెంట్ కు వెళ్లకుండా చేశారు అంటూ ఆమె కామెంట్స్ చేసింది.ప్రస్తుతం సుమ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఇకపోతే ఎఫ్ 3 సినిమా విషయానికి వస్తే ఇందులో హీరో వెంకటేష్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించగా, వరుణ్ తేజ్ సరసన మెహరీన్ హీరోయిన్ గా నటించింది.అదే విధంగా ఇందులో హీరోయిన్ సోనాల్ చౌహాన్ కూడా కీలక పాత్రలో నటించింది.

ఇందులో బుట్ట బొమ్మ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ కు చిందులు వేసే విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube