ఇదేందయ్యా ఇది.. ఓటు వేయడానికి చెడ్డీలు వేసుకుని వెళ్ళిన యువకులు!

ఆస్ట్రేలియాలో నిన్న శనివారం జరిగిన ఎన్నికల్లో విపక్ష లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది.దాంతో అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది.

 Is This It  Young People Who Went To Vote Wearing Shorts , Vote,  Labor Leader-TeluguStop.com

లేబర్ పార్టీ నేత ఆంటోనీ అల్బనీస్‌ ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.అయితే, ఈ ఎన్నికల సందర్భంగా అనేక మంది ఓటర్లు అండర్​వేర్​ మాత్రమే ధరించి, పోలింగ్ కేంద్రాలకు వెళ్లడం చర్చనీయాంశమైంది.ఆస్ట్రేలియాలో ప్రతి మూడు సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతాయి.151 స్థానాలున్న దిగువ సభకు సభ్యుల్ని ఎన్నుకునేందుకు శనివారం పోలింగ్ జరిగింది.

కరోనా గడ్డుకాలం వలన ఆ దేశంలోని కోటీ 70లక్షల మంది ఓటర్లలో 48శాతంపైగా ముందస్తు ఓటింగ్ లేదా పోస్టల్ విధానాన్ని ఎంచుకున్నారు.మిగిలిన ఓటర్లు శనివారం ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు.

తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు.అయితే.

అనేక పోలింగ్ కేంద్రాలకు కొందరు ఓటర్లు అండర్​వేర్ మాత్రమే ధరించి రావడం అందరి దృష్టిని ఆకర్షించింది.ఓటర్లు ఇలా లోదుస్తుల్లో రావడానికి ‘బడ్జీ స్మగ్లర్స్​’ అనే స్విమ్​వేర్​ కంపెనీ ఇచ్చిన ఆఫరే కారణం.

అండర్​వేర్​లో ఓటేస్తూ ఫొటో దిగి, సోషల్​ మీడియాలో షేర్​ చేస్తే తమ బ్రాండెడ్​ స్విమ్​వేర్​ను ఉచితంగా ఇస్తామని ప్రకటించింది ‘బడ్జీ స్మగ్లర్స్​’.అండర్​వేర్​లో ఓటేస్తూ ఫొటో దిగి, సోషల్​ మీడియాలో షేర్​ చేస్తే తమ బ్రాండెడ్​ స్విమ్​వేర్​ను ఉచితంగా ఇస్తామని ప్రకటించింది ‘బడ్జీ స్మగ్లర్స్’.

తమ ఆఫర్​కు అనూహ్య స్పందన వచ్చిందని తెలిపింది ‘బడ్జీ స్మగ్లర్స్​’.ఒకరిద్దరు పాల్గొంటారని అనుకుంటే… వందల మంది ముందుకు వచ్చారని హర్షం వ్యక్తం చేసింది.ఛాలెంజ్​లో పాల్గొన్నవారందరికీ సోమవారం నుంచి గిఫ్ట్స్​ పంపుతామని తెలిపింది ‘బడ్జీ స్మగ్లర్స్​’ సంస్థ.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube