స్వర్గం అంటే ఇదేనేమో.. నీళ్లలో గుర్రంపై స్వారీ చేస్తున్న యువతి.. వీడియో చూస్తే!

ఈ ప్రపంచంలో ఉన్న కొన్ని ప్రాంతాలు స్వర్గాన్ని తలపిస్తాయంటే అతిశయోక్తి కాదు.ఈ ప్రదేశాలకు వెళితే మనం మైమరిచిపోక తప్పదు.

 A Young Woman Riding A Horse In The Water Water, Viral News, Viral Latest, Socia-TeluguStop.com

ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలకు వెళ్ళే అదృష్టం కొంతమందికే దక్కుతుంది.చాలా మంది ట్రావెలింగ్ ఖర్చులు భరించలేక ప్రపంచంలోని అద్భుతమైన ప్రదేశాలను చూడకుండానే ఉండిపోతుంటారు.

కొందరు మాత్రం ట్రావెల్ కోసం ప్రత్యేకంగా డబ్బులు దాచుకుని మరీ అన్నీ ప్రదేశాలు వీక్షిస్తారు.

అయితే ఇలా ట్రావెలింగ్ చేయాలనుకునే వారు ఒక ప్లేస్‌ను తప్పక సందర్శించాలి.

ఎందుకంటే ఇక్కడ బ్లూ కలర్ లో ఉండే నీళ్లు మనల్ని మంత్రముగ్ధులను చేస్తాయి.తాజాగా ఇదే ప్లేస్ లో ఒక యువతి గుర్రంపై స్వారీ చేస్తూ ఎంజాయ్ చేసింది.

దీనికి సంబంధించిన వీడియోని ప్రముఖ నేచర్ లవర్ ఎర్త్ ఫిక్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.దీని చేసిన నెటిజన్లు… “వావ్, స్వర్గం అంటే ఇదేనేమో” అని కామెంట్ పెడుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో బ్రౌన్ కలర్ డ్రెస్ ధరించిన ఒక యువతి సన్ గ్లాసెస్ పెట్టుకుని గుర్రంపై కూర్చుని ఉండటం చూడవచ్చు.ఆమె గుర్రం పై కూర్చొని ఉండగా ఆ గుర్రాన్ని ఒక యువతి నీటిలో నడిపించుకుంటూ వెళుతుంది.

చూసేందుకు ఇది చాలా అద్భుతంగా అనిపించింది.పాపం ఆ గుర్రం నీటిలో నడిచేందుకు కష్టపడుతుందో ఏమో కానీ దాని పైన కూర్చున్న యువతి మాత్రం బాగా ఎంజాయ్ చేసింది.

చుట్టూ ఉన్న బ్లూ కలర్ నీటిని చూస్తూ ఆమె ఫిదా అయిపోయింది.

ఈ ప్రదేశం టాంజానియాలో నంగ్వి అనే గ్రామంలో ఉంటుంది.ఇక్కడ ఉండే బీచ్ ను నుంగ్వి బీచ్ (Nungwi Beach) అని పిలుస్తారు.ఇది టాంజానియా ద్వీపం ఉంగుజాలో ఉంటుంది.

దీనిని జాంజిబార్ అని కూడా పిలుస్తారు.ఇది విశాలమైన గ్రామం కాగా ఇందులో బీచ్ ఉంటుంది.

ఈ బీచ్ చూసేందుకు ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు.సముద్ర తాబేళ్లను ఇక్కడ సంరక్షిస్తున్నారు.

ఇక్కడ ఉండే తీరప్రాంతంలో, రంగురంగుల చేపలు, చూపు తిప్పుకోనివ్వని పగడపు దిబ్బలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube