ఇల్లు కడుతున్నవారికి గుడ్ న్యూస్... భారీగా తగ్గనున్న స్టీల్, సిమెంట్ ధరలు!

కరోనా గడ్డు కాలం నుండి నిత్యావసరాల వస్తువుల ధరలతో పాటు వంట ఆయిల్, గ్యాస్ ధరలు కూడా మిన్నంటాయి.ఈ క్రమంలో ఇసుక, సిమెంట్, ఐరెన్ ధరలు కూడా పెరగడం తెలిసిందే.

 Good News For Homeowners  Steel And Cement Prices To Plummet ,  Good News, Hous-TeluguStop.com

అందువలన బతకడమే కష్టమైనవేళ, కొందరు తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకునే దిశలో పెరిగిన ధరలను చూసి వెనక్కితగ్గారు.ఇపుడు అలాంటివారికి కేంద్రం వరుసగా గుడ్ న్యూస్ లు చెబుతోంది.

అవును.ఇప్పటికే పెట్రో, గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం, తాజాగా మరో గుడ్ న్యూస్ కూడా ప్రకటించింది.

అదేమంటే.ప్లాస్టిక్, సిమెంట్, ముడి పదార్ధాలపైన సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలపడం గమనార్హం.

ఇకనుండి ఉక్కు ముడిపదార్థాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించనుంది.అదే సమయంలో స్టీల్ ఉత్పత్తులపై ఎగుమతి సుంకం విధించనున్నట్లు వెల్లడించారు.అందువలన దేశంలో సిమెంట్, స్టీల్ కొరత తగ్గి ధరలు తగ్గుతాయని అన్నారు.ఇక వీటి ధరలు తగ్గినట్టయితే గృహ నిర్మాణ వ్యయం భారీగా తగ్గబోతోంది.

కాగా.పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం భారీగా తగ్గించింది.

దాంతో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా తగ్గనున్నాయి.దీనితో సుమారు లీటర్ పెట్రోల్ పై రూ.8, డీజిల్ పై రూ.6 ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

ఇక తగ్గించిన ధరలు అర్థరాత్రి నుంచే అమల్లోకి రానున్నాయి.తాజాగా ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వాహనదారులకు భారీ ఊరట కలగనుంది.

మరోవైపు గ్యాస్ సిలిండర్ ధరలను కూడా కేంద్రం తగ్గించింది.గృహ వినియోగదారులు వాడే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరపై రూ.200 సబ్సిడీ అందించనుంది.అయితే ఇది కొందరికి మాత్రమే అని కండీషన్ పెట్టింది.ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద కనెక్షన్ తీసుకున్న వారికి మాత్రమే రూ.200 సబ్సిడీ వర్తించనుంది.దీంతో సిలిండర్ చొప్పున రూ.200 తగ్గనుంది.ఏడాదికి 12 సిలిండర్లకు సబ్సిడీ వర్తిస్తుంది.దీంతో 9 కోట్ల మంది వినియోగదారులకు లబ్ది చేకూరనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube