ట్రంప్- రష్యా బంధంపై మీడియాకు లీక్ : హిల్లరీ క్లింటన్‌ పాత్రపై మాజీ ఉద్యోగి సంచలన వాంగ్మూలం

2016 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికలను రష్యా ప్రభావితం చేసిందనే వాదనలపై అక్కడి రాజకీయాల్లో నేటీకి ఇంకా చర్చ జరుగుతూనే వుంటుంది.తాజాగా ఈ వ్యవహారంలో డెమొక్రాటిక్ పార్టీ నేత, అప్పటి అమెరికా అధ్యక్ష అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ పాత్రపై మీడియాలో కథనాలు వస్తున్నాయి.

 Hillary Clinton Agreed To Release Unsubstantiated Research On Trump-russia Link,-TeluguStop.com

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంపెనీలోని కంప్యూటర్ సర్వర్‌లకు రష్యన్ బ్యాంక్‌తో రహస్య కమ్యూనికేషన్ లింక్ వుందని .దీనిని మీడియాకు తెలియజేసేందుకు హిల్లరీ వ్యక్తిగతంగా 2016లో ఒక ప్రణాళికను ఆమోదించారంటూ ఆమె క్యాంపెయిన్ మేనేజర్ జ్యూరీ సభ్యులకు తెలిపారు.ఎఫ్‌బీఐకి అబద్ధం చెప్పినట్లు అభియోగాలు మోపబడిన హిల్లరీ క్లింటన్ క్యాంపెయిన్ లాయర్, విచారణలో సాక్షి అయిన రాబీ మూక్ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రచారంలో పాల్గొన్న ఇతర వ్యక్తులు సర్వర్ డేటా వాస్తవికతపై నమ్మకంగా లేరని మూక్ వాంగ్మూలం ఇచ్చారు.

అయినప్పటికీ దీనిని ఎన్నికలకు కొద్ది నెలల ముందు మీడియాకు పంపాల్సిందిగా క్లింటన్ సూచించారని ఆయన తెలిపారు.

ట్రంప్ ఆర్గనైజేషన్, రష్యా కేంద్రంగా పనిచేస్తున్న ఆల్ఫా బ్యాంక్ మధ్య ఉద్దేశించిన సర్వర్ లింక్ చివరికి ఎఫ్‌బీఐ చేత తొలగించబడింది.

మాజీ క్యాంపెయిన్ లాయర్ మైఖేల్ సుస్మాన్ సెప్టెంబర్ 2016లో ఆ దావాను ఏజెన్సీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు .తాను ఏ క్లయింట్‌కు ప్రాతినిథ్యం వహించడం లేదని ఎఫ్‌బీఐకి చెప్పాడు.దీనికి గాను ఇప్పుడు మైఖేల్ విచారణను ఎదుర్కొంటున్నాడు.సర్వర్ థియరీ .క్యాంపెయిన్‌కు న్యాయ సేవా సంస్థగా వ్యవహరించిన పెర్కిన్స్ కోయి బయటపెట్టింది.ఇది ఫ్యూజన్ జీపీఎస్ అనే వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న సెక్యూరిటీ సంస్థ నుంచి వచ్చింది.

ప్రముఖ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు రాబర్ట్ జోఫ్ ఆదేశాల మేరకు థియరీ, ఇంటర్నల్ డేటాను ఫ్యూజన్ రూపొందించింది.అయితే ఎన్నికల ముగిసిన చాలా కాలం వరకు ఫ్యూజన్ పాత్ర గురించి తనకు తెలియదని, అయితే నిపుణుల నుంచి వచ్చిన థియరీని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు.

క్యాంపెయిన్ సమయంలో తాను కానీ మరొకరు గానీ ఈ సమాచారాన్ని ఎఫ్‌బీఐకి అందజేయమని సుష్మాన్‌ను ఆదేశించలేదని మూక్ వాంగ్మూలం ఇచ్చారు.

Telugu Hillary Clinton, Robbie Mook, Robert Joff, Robert Mueller, Russia, Trump,

ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ట్రంప్ చర్యలు పుతిన్‌కు అనుకూలంగా వున్నాయని మూక్ తెలిపారు.నాటో కూటమి నుంచి అమెరికా వైదొలగాలని ట్రంప్ చేసిన సూచనను.రష్యాలో అతని విస్తృత వ్యాపార లావాదేవీలను గుర్తించానని ఆయన చెప్పారు.

అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రత్యర్ధులపై పరిశోధనలు చేయడం అసాధారణమైన విషయం కాదన్నారు.తద్వారా వారు మీడియాకు హానికరమైన సమాచారాన్ని అందిస్తారని విశ్లేషకులు అంటున్నారు.

కానీ ప్రచారం సందర్భంగా విశ్వాసం లేని ఒక సిద్ధాంతాన్ని వ్యాప్తి చేయడం వెనుక హిల్లరీ క్లింటన్ పాత్రపై ట్రంప్ హయాం నాటి “witch hunt” వాదనలను బలపరుస్తోంది.అయితే ప్రత్యేక న్యాయవాది రాబర్ట్ ముల్లర్ తన నివేదికలో మాత్రం.

ట్రంప్- రష్యా మధ్య సంబంధాలు నిజమని చెప్పారు.డొనాల్డ్ ట్రంప్ జూనియర్, జారెడ్ కుష్నర్, పాల్ మనాఫోర్ట్‌లతో సహా ట్రంప్ క్యాంపెయిన్‌లో అధికారులుగా వున్న వారు జూన్ 9, 2016న ట్రంప్ టవర్‌లో రష్యన్ బృందంతో సమావేశమయ్యారు.

ఇదే సమయంలో హిల్లరీ క్లింటన్‌ తన తప్పులు కప్పిపుచ్చుకొనేందుకు ఓ ప్రణాళిక ప్రకారమే ట్రంప్‌నకు రష్యాతో సంబంధం ఉన్నట్టు చిత్రీకరించారని, ట్రంప్‌-2020 ఎన్నికల ప్రచార ప్రతినిధి టిమ్‌ ముర్తాగ్‌ రెండేళ్ల క్రితం చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube