గెటౌట్ అంటూ సమీర్ ను వెళ్లిపోవాలని చెప్పిన సుమ.. దేవిని ఇమిటేట్ చేస్తూ?

బుల్లితెర షోలలో ఒకటైన క్యాష్ షోకు సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్నారనే సంగతి తెలిసిందే.క్యాష్ షోలో డేగల బాబ్జీ టీమ్ బండ్ల గణేష్, సమీర్, జోష్ రవి, వెంకట్ చంద్ర హాజరయ్యారు.

 Suma Comments About Sameer Goes Viral In Social Media Details Here , Bandla Gane-TeluguStop.com

ప్రోమోలో సుమ మీరు అందంగా ఉండటానికి నేను పంపించిన కోడిగుడ్లే కారణమని బండ్ల గణేష్ కామెంట్ చేశారు.ఇది డేగల బాబ్జీ ప్రమోషన్ లా లేదని కోడిగుడ్డు ప్రమోషన్ లా ఉందని వెంకట్ చంద్ర చెప్పుకొచ్చారు.

తాను కోడి బాబ్జీ అని పెడదామని చెబితే బాగోదని డేగల బాబ్జీ అని పెడదామని చెప్పారని బండ్ల గణేష్ అన్నారు.

దేవుడు ప్రత్యక్షమై ఒక వరం కోరుకోవాలని చెబితే ఏం కోరుకుంటారని బండ్ల గణేష్ ను అడగగా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని నేను కూడా బాగుండాలని కోరుకుంటానని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.

సమీర్ సుమతో ఈ కాలంలో ఎవరైనా పేరెంట్స్ మాట వింటున్నారా అని అడగగా వీళ్లు పేరెంట్స్ మాట వినడం లేదని నువ్వు అనుకుంటున్నావా అంటూ రివర్స్ లో సుమ ప్రశ్నించారు.సుమ సమీర్ ను గెటౌట్ అంటూ దేవీ నాగవల్లిని ఇమిటేట్ చేశారు.

గెటౌట్ గెటౌట్ అనడంతో మీరే పిలిచి మీరే గెటౌట్ అంటారా అని సమీర్ అన్నారు.సమీర్ మైక్ తీస్తుండగా సుమ వెళ్లిపో అంటుంది.

సమీర్ మీరెవరండి వెళ్లిపోవడానికి అంటూ రివర్స్ లో కౌంటర్ ఇస్తారు.సుమ ఔట్ అనగా ఏందమ్మా ఔట్ నువ్వేమైనా రామోజీ రావు గారివా అని బండ్ల గణేష్ ప్రశ్నించారు.

ఈటీవీ పర్మినెంట్ క్యాష్ పర్మినెంట్ అని సుమ మాత్రం పర్మినెంట్ కాదని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.

ఈటీవీలో మొక్కలు పెట్టినప్పటి నుంచి ఉన్నానని సుమ చెప్పగా నేను స్థలం కొన్నప్పటి నుంచి ఉన్నానని బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు.రామోజీ ఫిల్మ్ సిటీ యాడ్ చేసింది సుమనే అని సమీర్ చెప్పగా ఆమె యాడ్ చేశారని అయితే ఆ ఆలోచన ఇచ్చిందే తానని బండ్ల గణేష్ పేర్కొన్నారు.బండ్ల గణేష్ ప్రోమోలో వేసిన పంచ్ లు వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube