కోలీవుడ్ యువ హీరో శివ కార్తికేయన్ వరుస సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నాడు.తమిళంలోనే కాదు శివ కార్తికేయన్ సినిమాలు తెలుగులో కూడా మంచి విజయాలను అందుకుంటున్నాయి.
వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్ రెండు సినిమాలు తమిళంతో పాటుగా తెలుగులో కూడా సక్సెస్ అయ్యాయి.ఇక ఇప్పుడు తెలుగులో జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ డైరక్షన్ లో బైలింగ్వల్ మూవీ చేస్తున్నాడు శివ కార్తికేయన్.
ఆ సినిమాతో పాటుగా కమల్ హాసన్ ప్రొడ్యూసర్ గా ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.రాజ్ కుమార్ పెరియసామి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమాకు టైటిల్ గా మావీరన్ గా ఫిక్స్ చేశారు.ఈ సినిమాను తమిళంతో పాటుగా తెలుగులో కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.శివ కార్తికేయన్, సాయి పల్లవి ఇద్దరు టాలెంటెడ్ యాక్టర్స్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగులో మంచి మార్కెట్ పెంచుకునే క్రమంలో తన ప్రతి సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు శివ కార్తికేయన్.
చూస్తుంటే తెలుగులో కూడా శివ కార్తికేయన్ తన పాపులారిటీ కొనసాగించేలా ఉన్నాడు.