చిరు బాటలోనే పవన్ కళ్యాణ్.. సేమ్ లవ్ స్టోరీ రిపీట్?

సాధారణంగా ఇండస్ట్రీలో ఎన్నో జోనర్లు ఉన్నప్పటికీ అటు లవ్ స్టోరీ కీ మాత్రం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతారూ.లవ్ స్టోరీలలో కూడా పలు రకాలు అని చెప్పాలి.

 Chiru And Pawan Kalyan Is In Same Situation , Chiranjeevi , Pawana Kalyan,  Hari-TeluguStop.com

కొన్ని సినిమాల్లో స్టూడెంట్స్ మధ్య ప్రేమ పడుతూ ఉంటే.కొన్ని సినిమాల్లో మాత్రం ఏకంగా లెక్చరర్ స్టూడెంట్స్ మధ్య ప్రేమ పుడుతూ ఉంటుంది.

ఇక ఇలాంటి నేపథ్యంలో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ సాధించాయి.విక్టరీ వెంకటేష్ నటించిన సుందరకాండ సినిమాలో కూడా ఇలా లెక్చరర్ స్టూడెంట్ మధ్య ప్రేమ కథ ఉంటుంది ఇది ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావడంతో సూపర్ హిట్ అయింది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మాస్టర్ సినిమాలో కూడా ఇలాగే స్టూడెంట్ లెక్చరర్ మధ్య ప్రేమ పుడుతూ ఉంటుంది.అయితే ఇక ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే ఇకపోతే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అన్న చిరంజీవి బాటలోనే నడుస్తున్నాడు అన్నది తెలుస్తుంది.

చిరంజీవి మాస్టర్ సినిమా నేపథ్యం తోనే ఇక ఇప్పుడు తన భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమాను ప్లాన్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్.మరికొన్ని రోజుల్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది అన్న విషయం తెలిసిందే.

Telugu Chiru, Harish Shanker, Master, Pawan Kalyan, Sundarakanda, Venkatesh-Late

అయితే ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లెక్చరర్ పాత్రలో కనిపించబోతున్నారు ఇక భగత్ సింగ్ కి లెక్చరర్ పాత్రలో ఉన్న పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా ఉంటాడట.ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా స్వయంగా దర్శకుడు హరీష్ శంకర్ ఈ విషయం చెప్పడంతో ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది.ఇక ఈ కారణంగానే సినిమాకు ఆ టైటిల్ ఫిక్స్ చేశారట.

అయితే మొదటి సారి పవన్ కళ్యాణ్ కెరీర్లో లెక్చరర్ పాత్రలో చేస్తున్నాడు అని చెప్పాలి.ఈ క్రమంలోనే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి.

కాగా అంతకు ముందు సింహ సినిమాలో బాలయ్య మిరపకాయ సినిమాలో రవితేజ కూడా ఇలా స్టూడెంట్స్ తో ప్రేమలో పడ్డారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube