ఆ పోలీస్ డాన్సులోనే కాదు, సాయం చేయడంలోనూ మంచి దిట్ట అని నిరూపించుకున్నాడు!

నిత్యం ట్రాఫిక్ ధ్వనుల మధ్య శ్రమ తెలియకుండా ఉండేందుకు, ప్రయాణికులను అలరించేందుకు డాన్స్​ చేస్తూ ట్రాఫిక్​ను కంట్రోల్​ చేస్తూ, డాన్సింగ్​ ట్రాఫిక్​ కాప్​గా గుర్తింపు పొందిన ఇన్​స్పెక్టర్​ ‘రంజిత్​ సింగ్’ గురించి అందరికీ తెలిసినదే.అయితే అతగాడు మరోమారు తన గొప్పతనాన్ని రుజువుచేసుకున్నాడు.

 Indore Dancing Cop Ranjith Singh Helps Poor Children Buys Slippers Details, Traf-TeluguStop.com

అవును.మండుటెండలో చెప్పులు లేకుండా రోడ్డు దాటేందుకు వచ్చిన ఓ బాలుడిని చూసి జాలిపడి రోడ్డు దాటేవరకు ఆ కుర్రాడిని తన కాళ్లపైన నిల్చుబెట్టుకున్నాడు.

అంతటితో ఆగకుండా ట్రాఫిక్ తగ్గాక అతనికి చెప్పులు కూడా కొనిచ్చి, తన ఔదార్యాన్ని చాటుకున్నాడు.

మధ్యప్రదేశ్​లోని ఇందోర్​లో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే, అక్కడ ట్రాఫిక్​ కంట్రోల్​ చేయడంలో రంజిత్​ బిజీగా ఉన్న సమయంలో రోడ్డు దాటేందుకు వచ్చిన ఓ ఇద్దరు చిన్నారులు ఆయన కంటపడ్డారు.ట్రాఫిక్ బాగా రద్దీగా ఉండడంతో రంజిత్​ దగ్గరకు వచ్చి రోడ్డు దాటించేందుకు సాయం చేయమని వారు అడిగారు.

దాంతో ఆ ఇద్దరి కుర్రాళ్లలో ఒకరు చెప్పులు లేకుండా ఉండటం గమనించి మండుటెండలో చెప్పులు లేకుండా తిరగడం చూసి జాలిపడ్డాడు.వెంటనే ఆ కుర్రాడిని కాసేపు అయన పాదాల మీద నిల్చోపెట్టుకున్నారు.

అనంతరం ఆ బాలుడిని షాపుకు తీసుకెళ్లి మంచి చెప్పుల జత ఒకటి కొనిచ్చారు.

Telugu Buys Slippers, Helps Poor, Indore Cop, Madhya Pradesh, Latest-Latest News

కాగా రంజిత్​ కాళ్లపై కుర్రాడు నిల్చున్న ఫొటోలు సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.విషయం తెలుసుకున్న నెటిజన్లు రంజిత్ పైన అభిమానం వెల్లువ కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.నేటితరానికి ఈయనే రోల్ మోడల్ అని ఒకరంటే, సినిమా హీరోలు కాదు.

అభిమానులారా నిజమైన హీరోని చూడండి, ఇతడే అతను ఒకరు కామెంట్ చేసారు.యావత్ దేశ పోలీస్ వ్యవస్థ అంతా కలిసి ఇతగాడిని చూసి నేర్చుకోండి… అని మరొకరు కామెంట్ చేసారు.

హేట్సాఫ్ రంజిత్ జి.మీకు నేను దాసోహం అయిపోయాను అని ఓ మహిళ కామెంట్ చేయడం మనం చూడవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube