మహేష్ 28.. అది నిజమైతే అదుర్స్..!

సర్కారు వారి పాట హిట్ జోష్ లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ తన నెక్స్ట్ సినిమాకు రెడీ అవుతున్నాడు.త్రివిక్రం డైరక్షన్ లో మహేష్ సినిమా ఉంటుందని తెలిసిందే.

 Mahesh 28 Crazy Update Trivikram Direction , Mahesh , Mahesh 28, Nani, Naturalst-TeluguStop.com

హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా వస్తుంది. పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించనున్నాడు.

మహేష్ 28వ సినిమాగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ గురించి లేటెస్ట్ అప్డేట్ ఫ్యాన్స్ ని ఎక్సయిట్ అయ్యేలా చేస్తుంది.త్రివిక్రం ఈ సినిమాలో మహేష్ తో పాటుగా మరో హీరోని కూడా తీసుకుంటున్నాడట.

అదికూడా నాచురల్ స్టార్ నాని మహేష్ 28వ సినిమాలో ఉంటున్నాడని వార్తలు వస్తున్నాయి.స్టార్ సినిమా అంటే రకరకాల వార్తలు రావడం కామనే.అందులో ఏది వాస్తవం అన్నది మాత్రం చిత్రయూనిట్ ప్రకటించాల్సి ఉంటుంది.ఈ క్రమంలో మహేష్ 28వ సినిమాలో మరో హీరో అన్న వార్తలపై కూడా చిత్రయూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

ఒకవేళ నిజంగానే మహేష్ సినిమాలో నాని ఉంటే మాత్రం ఆ సినిమా లెక్క వేరేగా ఉంటుందని చెప్పొచ్చు. త్రివిక్రం తో హ్యాట్రిక్ సినిమా చేస్తున్న మహేష్ వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేయాలని చూస్తున్నారట.

అంతేకాదు 2023 సంక్రాంతికి సినిమా రిలీజ్ ఫిక్స్ చేస్తారని టాక్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube