ఆ రెండు పెద్ద సినిమాల మేకర్స్‌ కు బుద్ది వచ్చిందా?

సౌత్‌ సినీ ప్రేక్షకుల ముందుకు ఇటీవల వచ్చిన ఆర్ ఆర్‌ ఆర్‌ మరియు కేజీఎఫ్ 2 సినిమాలు ఎంతటి భారీ విజయాలను సొంతం చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ రెండు సినిమా లు కూడా వెయ్యి కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టాయి.

 Rrr And Kgf 2 Movie In Ott Pay For View Details, Kgf 2, Rrr Kgf 2 Rrr Ott, Ott P-TeluguStop.com

ఈ సినిమా ను చూడాలని ప్రతి ఒక్కరు కోరుకున్నా కూడా థియేటర్ల లో భారీ టికెట్ల రేట్లు పెట్టి చూడలేక చాలా మంది ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం వెయిట్‌ చేశారు.ఎట్టకేలకు ఓటీటీ లో ఈ రెండు సినిమా ల స్ట్రీమింగ్‌ అవ్వబోతున్నాయి అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా ఆ సినిమా లను చూడాలంటే రెంట్‌ కట్టాలంటూ ఓటీటీ లు మెలిక పెట్టడంతో ప్రతి ఒక్కరు కూడా ముక్కున వేలేసుకున్నారు.

బాబోయ్‌ ఇదేం రచ్చరా నాయన అంటూ కామెంట్స్ చేశారు.చాలా మంది చాలా రకాలుగా ఆ నిర్మాతలను విమర్శించారు.అమెజాన్ లో కేజీఎఫ్‌ 2 ను చూడటం కోసం భారీ మొత్తంలో పెట్టాల్సి ఉండటంతో కనీసం వందల సంఖ్యలో కూడా ఆ సినిమా ను చూడలేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పైగా విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో ఇక చేసేది లేక సినిమాను ఓటీటీ పే పర్ వ్యూ పద్దతిన కాకుండా డైరెక్ట్ గా ఫ్రీ గా చూసే అవకాశం ను కల్పించారు.

Telugu Amazon Prime, Kgf, Kgf Chapter Ott, Ott, Ott Pay Per, Pan India, Ram Char

దాంతో సోషల్‌ మీడియాలో ఓటీటీ వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.చాలా మంది విమర్శించడంతో వారికి బుద్ది వచ్చినట్లుగా ఉంది.అందుకే ఓటీటీ ఖతాదారులకు ఫ్రీగానే చూపించేందుకు సిద్దం అయ్యారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.మొత్తానికి ఓటీటీ లో ఈ రెండు సినిమా లు కూడా స్ట్రీమింగ్ అవుతున్న నేపథ్యంలో అభిమానులు పిచ్చ హ్యాపీగా ఉన్నారు.

సినిమా ను మళ్లీ మళ్లీ స్ట్రీమింగ్‌ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube