ఈ జీపులో కేవలం రూ.5లతో 70 కిలోమీటర్ల మేర ప్రయాణించొచ్చు.. తెలుసా?

పెట్రోల్, డీసెల్ ధరలు ఆకాశాన్నంటున్నవేళ కొంతమంది ప్రతిభగల యువకులు ప్రత్యామ్నాయ మార్గాలగురించి వెతుకుతున్నారు.ఈ క్రమంలోనే ఓ యువకుడు వినూత్న ఆవిష్కరణతో ముందుకొచ్చాడు.

 This Jeep Can Cover 70 Km For Just Rs 5rs , 7p Km, Viral Latest, Viral News, Soc-TeluguStop.com

పంజాబ్​​కు చెందిన గురుచరణ్​ సింగ్ అనే అతను లేటెస్ట్​ టెక్నాలజీతో ఈ-జీప్​​ను తయారు చేశాడు.ఒక్క యూనిట్​ ఛార్జ్​ చేస్తే సుమారు 70 కిలోమీటర్లు మైలేజీ ఇస్తుందని చెబుతున్నాడు.

ఇక ఇటీవలికాలంలో పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరుతుతున్న తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రాధాన్యం బాగా పెరిగింది.

ఈ నేపథ్యంలో పలు సంస్థలు ఇప్పటికే ఎలక్ట్రిక్ బైక్స్, కార్ల​ను ప్రవేశపెట్టాయి.

ఈ నేపథ్యంలో పంజాబ్​కు చెందిన ఓ యువకుడు తయారు చేసిన ఎలక్ట్రిక్ జీప్​ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.ఈ వాహనం నిర్వహణకు తక్కువ ఖర్చు అవడమే దానికి అసలైన కారణం.

ఈ-జీప్​​ కేవలం ఒక యూనిట్​ ఛార్జ్ చేస్తే 70 కిలోమీటర్ల దూరం.గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.

బటిండా జిల్లాలోని విశ్వకర్మ మార్కెట్‌లో ఉన్న డెంటింగ్ పెయింటర్ గురుచరణ్ సింగ్ ఎలక్ట్రిక్ జీప్‌ను రూపొందించాడు.ఇంతకుముందు మార్కెట్లోకి వచ్చిన ఎలక్ట్రిక్ కార్లు తయారీ సంస్థలు ఫైబర్‌ మెటీరియల్​ను ఉపయోగించాయని, అయితే తాము అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ జీప్‌లో ఇనుము ఉపయోగించామని సింగ్ చెప్పడం హర్షణీయం.

అయితే దీని నిర్మాణానికి దాదాపు 7 రోజులు పట్టిందని తెలిపాడు.ఈ సందర్భంగా సింగ్ మాట్లాడుతూ.“దేశంలో మండిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరల నేపథ్యంలో నాకు ఈ ఐడియా తట్టింది.ఆ ఆలోచనలోనుండే ఈ జీప్ ని ఆవిష్కృతం చేయడం జరిగింది.ఈ ఎలక్ట్రిక్ జీప్ ధర దాదాపు రూ.15 లక్షలు ఉంటుంది.మా ప్రాంతానికి వచ్చే కొత్త వారు ఈ జీప్​ను చూసి ఆశ్చర్యపోతున్నారు.అయితే ఇప్పుడు మరో ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేసేందుకు ఆర్డర్‌ను అందుకున్నాను.పెరుగుతున్న చమురు ధరల నుంచి ప్రజలు విముక్తి పొందుతారు.ఈ ఎలక్ట్రానిక్ జీప్​ సమర్థంగా పనిచేస్తుంది.” అని అన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube