బాలయ్య కంటే వెంకీ రెమ్యునరేషన్ ఎక్కువా.. ఎఫ్3 మూవీకి ఎంత తీసుకున్నారంటే?

స్టార్ హీరో బాలకృష్ణ రెమ్యునరేషన్ కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరనే సంగతి తెలిసిందే.నిర్మాత తక్కువ మొత్తం రెమ్యునరేషన్ ఇచ్చినా కథ నచ్చితే తక్కువ రెమ్యునరేషన్ తో సినిమా చెయ్యడానికి కూడా బాలయ్య ఓకే చెబుతారు.

 Victory Venkatesh F3 Movie Remuneration Details Here Goes Viral   F3 Movie, Venk-TeluguStop.com

అటు మాస్ ఫ్యాన్స్ లో, ఇటు క్లాస్ ఫ్యాన్స్ లో బాలయ్యకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.బాలయ్య గోపీచంద్ మలినేని సినిమా కోసం కేవలం 12 కోట్ల రూపయల రెమ్యునరేషన్ జీఎస్టీ తీసుకుంటున్నారు.

బాలయ్య గత సినిమా అఖండ నిర్మాతలకు ఊహించని స్థాయిలో లాభాలను అందించడం గమనార్హం.అఖండ శాటిలైట్, డిజిటల్ హక్కులు సైతం రికార్డ్ రేటుకు అమ్ముడయ్యాయని వార్తలు వచ్చాయి.

బాలయ్య డిమాండ్ చేస్తే ఆయన సినిమాకు 20 నుంచి 25 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోవడం సమస్య కాదని చెప్పవచ్చు.అయితే ఎఫ్3 సినిమా కోసం వెంకీ తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

Telugu Akhanda, Anil Ravipudi, Balakrishna, Mahreen, Sunil, Tamanna, Varun Tej-M

ఎఫ్2 సినిమా కోసం వెంకటేష్ కేవలం 5 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారు.ఆ సినిమాకు ముందు వెంకటేష్ నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు హిట్టైనా బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లను సాధించడంలో విఫలయ్యాయయి.అయితే ఎఫ్3 సినిమాకు మాత్రం వెంకటేష్ 15 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం.ఎఫ్3పై భారీ అంచనాలు ఏర్పడటంతో ఈ స్థాయిలో వెంకీ డిమాండ్ చేశారని బోగట్టా.అయితే వెంకటేష్ కు తర్వాత సినిమాలకు కూడా ఇదే స్థాయిలో రెమ్యునరేషన్ దక్కుతుందా? అంటే మాత్రం చెప్పలేమనే సమాధానం వినిపిస్తోంది.వెంకటేష్ స్ట్రెయిట్ కథలతో పోల్చి చూస్తే రీమేక్ కథలకే ఎక్కువగా ఓటేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో యంగ్ డైరెక్టర్లకు వెంకటేష్ ఎక్కువగా అవకాశాలను ఇస్తున్నారు.స్టార్ హీరో వెంకటేష్ కొత్త సినిమాలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube