హైదరాబాద్: ఈ విషయం తెలుసా? ఈరోజు అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్స్ బంద్!

రాష్ట్ర ప్రభుత్వం నూతన మోటర్ వాహనాల చట్టం 2019 అమలు చేస్తూ, జరిమానాల పేరుతో ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్లను వేధించుకు తింటున్నారని డ్రైవర్స్ JAC నిరసన వ్యకం చేస్తోంది.ఈ నేపథ్యంలో ఈరోజు అనగా 18-05-2022 బుధవారం అర్ధరాత్రి నుంచి హైదరాబాద్‌లో లారీలు, ఆటోలు, క్యాబ్‌ల సేవలు నిలివేయబడతాయని తెలిపింది.

 Hyderabad: Do You Know This Autos And Cabs Closed From Midnight Today Hyderabad,-TeluguStop.com

న్యూమోటర్ వెహికల్ చట్టం 2019ని ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ.ఒక్కరోజు వాహనాల బంద్‌కు పిలుపునిచ్చారు.అంతేకాకుండా, ఫిట్‌నెస్‌ లేట్ ఫీజు పేరుతో రోజుకు రు.50 వసూలు చేయడంపై తీవ్రంగా మండిపడుతున్నారు డ్రైవర్లు.

పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్‌, ధరలతో భారంగా వాహనాలు నడుపుతున్న తరుణంలో అదనపు భారం తగదని, ఈ చర్యను వ్యతిరేకిస్తూ.గురువారం ట్రాన్స్‌పోర్టు భవన్‌ ముట్టడికి పిలుపునిచ్చింది.

ఖైరతాబాద్‌ చౌరస్తా నుంచి, ట్రాన్స్‌పోర్ట్‌ భవన్‌ వరకు డ్రైవర్ల యూనియన్‌ JAC భారీ ర్యాలీగా వెళ్లి, తమ నిరసన తెలియజేస్తామని ప్రకటించింది.వెహికల్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, EMIలు విపరీతంగా పెరిగిపోయి.

వాహనాలు నడపడమే కష్టంగా మారిన గడ్డు పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక వ్యతిరేక చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ సగటు కార్మికుల నడ్డివిరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Auto Band, Cabs, Hyderabad, Latest-Latest News - Telugu

ఆన్‌లైన్‌లో పెండింగ్‌ చలాన్ల రూపంలో వేలాది రూపాయలు బకాయిలు ఉన్నట్లుగా చూపించడం దారుణమైన పరిణామమని డ్రైవర్లు వాపోతున్నారు.కిరాయి వాహనాలు తిప్పుకునే డ్రైవర్లకు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వలన డైలీ కూలీ రు.500 కూడా గిట్టుబాటు కావడం లేదని అంటున్నారు.అలాగే సొంత వెహికల్ ఓనర్లకు ట్యాక్స్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ EMIలతో వాహనాలు నడపలేని స్థితిలో ఉంటే, మరోవైపు ప్రభుత్వం ఈ తరహాలో దోచుకోవడం పట్ల నిరసనని వ్యక్తం చేస్తున్నారు.కరోనా కష్టకాలం తరువాత ఉపాధి కోల్పోయి అప్పులు పాలైన డ్రైవర్లు ఇప్పుడిప్పుడే కోలుకుంటుంటే ప్రభుత్వం ఈ మాదిరిగా కొత్త చట్టాల పేరుతో తమ దగ్గర ముక్కు పిండి డబ్బులు వసూలు చేయడం న్యాయం కాదని తమగోడు వెళ్లబుచ్చుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube