నివేత పేతురాజ్ కు ఏమైంది.. ఆమె ముఖం ఏంటి ఇలా అయిపోయింది!

తెలుగు సినీ నటి నివేత పేతురాజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.తన నటనతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకుంది.

 What Happened To Nivetha Pethurj And Her Face Details,  Nivetha Pethuraj, Tollyw-TeluguStop.com

అతి తక్కువ సమయంలో ఎంతోమంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది.చూడటానికి సీరియస్ లుక్ తో కనిపించే ఈ బ్యూటీ టాలీవుడ్ లో ఎక్కువగా నెగిటివ్ పాత్రలలోనే నటించింది.

తెలుగుతో పాటు తమిళ సినిమాలలో కూడా నటించింది నివేత.ఇక మోడల్ గా కూడా మంచి పేరు సంపాదించుకుంది.ఇదిలా ఉంటే తన గురించి ఓ విషయాన్ని పంచుకుంది.

2016లో తమిళ సినిమా ద్వారా తమిళ సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.ఆ తర్వాత ఏడాది మెంటల్ మదిలో అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.ఆ తర్వాత వరుసగా తమిళ, తెలుగు సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకుంది.

చిత్రలహరి, అలా వైకుంఠపురంలో సినిమాలలో సీరియస్ పాత్రలలో బాగా మెప్పించింది.ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది.

ఇక నరేష్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పాగల్’ సినిమాతో తన నటనకు మంచి సక్సెస్ అందుకుంది.ఈ సినిమాలో విశ్వక్ సేన్, నివేత పేతురాజ్ నటించారు.ఇక ఈ సినిమాలో కూడా తనకు సీరియస్ పాత్రలో నటించింది.నిజానికి తన లుక్స్, ప్రవర్తన అలా అనిపించడం వల్ల సీరియస్ క్యారెక్టర్స్ బాగా సూట్ అవ్వడం వల్ల తనకు ఇలాంటి పాత్రలు ఇస్తుంటారు.

Telugu Face, Nivethapethuraj, Paagal, Telugu, Tollywood, Vishwak Sen-Movie

నివేత పేతురాజ్ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టీవ్ గా ఉంటుంది.నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా పంచుకుంటుంది.ముఖ్యంగా ఫోటోషూట్ లంటూ తెగ హడావుడి చేస్తుంది.తన ఫ్రెండ్స్ తో దిగిన ఫోటోలను, ఫన్నీ రీల్స్ వీడియోలను పంచుకుంటూ ఉంటుంది.

Telugu Face, Nivethapethuraj, Paagal, Telugu, Tollywood, Vishwak Sen-Movie

నిజానికి ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందడానికి ప్రయత్నిస్తుంది.దీంతో తన ట్రెండీ లుక్ లతో బాగా హడావుడి చేస్తుంది.ఇక ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.ఇక తన అభిమానులతో కూడా ముచ్చట్లు పెడుతూ ఉంటుంది.వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇస్తుంది.అప్పుడప్పుడు తన మూవీ అప్డేట్ లను కూడా పంచుకుంటూ ఉంటుంది.

Telugu Face, Nivethapethuraj, Paagal, Telugu, Tollywood, Vishwak Sen-Movie

ఇదిలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్టాలో ఒక స్టోరీ పంచుకుంది.అందులో తన ముఖం మొత్తం మారిపోగా.తన ఫాలోవర్స్ ఏంటి ఇలా అయ్యింది అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.నిజానికి తన ముఖం పై ఏమీ కాలేదు.జస్ట్ ఒక ఫిల్టర్ ద్వారా సెల్ఫీ దిగగా.అందులో ఆమె ముఖం పై చిన్న చిన్న బొమ్మలు వచ్చాయి.

ఇక ఆ ఫోటోను షేర్ చేసుకున్న వెంటనే తెగ లైకులు సంపాదించుకుంది.ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారగా నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

ఇక ప్రస్తుతం ఈ అమ్మడు కోలీవుడ్లో కూడా పలు అవకాశాలు అందుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube