రంగుల మధ్య పనిచేసే పెయింటర్లు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారంటే..

ఇళ్లలో రంగులు వేసే పెయింటర్లు తెల్లటి దుస్తులు ధరించడంలో పాటు తెల్లటి టోపీని కూడా పెట్టుకుంటారు.ప్రొఫెషనల్ పెయింటర్లు ధరించే ఈ దుస్తులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి.

 Why Do Painter Wear White Know The Reason Behind It , Painter , Painter Wear Whi-TeluguStop.com

పెయింటింగ్ వేసేటప్పుడు గోడలకు రకరకాల రంగులు వేస్తారని, అయినప్పటికీ వారు తెల్లని దుస్తులు ఎందుకు ధరిస్తారని ఎప్పుడైనా ఆలోచించారా? ఇలాంటి దుస్తులు ధరించడానికి చాలా కారణాలున్నాయి.నిపుణుల అభిప్రాయం ప్రకారం, తెలుపు రంగును శుభ్రతకు చిహ్నంగా కూడా గుర్తిస్తారు.

పెయింటర్లు అలాంటి దుస్తులను ధరించడం ద్వారా మరింత చక్కగా, ప్రొఫెషనల్‌గా కనిపిస్తారు.దీనికి మరో కారణం కూడా చెబుతారు.17వ శతాబ్దంలో పెయింటర్లు తమ షర్టు-ప్యాంట్‌లను ఓడలలో ఉపయోగించే తెల్లటి వస్త్రంతో కుట్టించుకునేవారని, పని చేసే సమయంలో వాటినే ధరించేవారని, అందుకే తెలుపు రంగు అలవాటుగా మారిందని చెబుతారు.పెయింటింగ్ స్పెషలిస్ట్ వెబ్‌సైట్ ప్రకారం, చాలా ఇళ్ళు, భవనాలకు పెయింటింగ్ వేయడానికి లేత రంగును ఉపయోగిస్తారు.

ఈ రంగులు వారి బట్టలపై పడినప్పుడు, అవి పెద్దగా, అసహ్యంగా పాచెస్ రూపంలో మారవని వారు భావిస్తారు.ధరించిన దుస్తులు, పెయింట్ రెండింటి లేత రంగు కారణంగా, బట్టలు మురికిగా కనిపించవని చెబుతారు.

అందుకే తెల్లటి దుస్తులు ధరిస్తారు.దీనికి ఇంకా చాలా కారణాలు కూడా చెబుతుంటారు.

పెద్ద పెద్ద భవనాల్లో పెయింటింగ్‌లు వేసే సమయంలో పెయింటర్లు నేరుగా సూర్యరశ్మికి గురవుతారని కొన్ని నివేదికల్లో పేర్కొన్నారు.సూర్యకాంతి ప్రభావం వారిపై పడటంతో తెల్లని బట్టలు ధరించడం అనేది మొదలైంది.

నిజానికి తెలుపు రంగు దుస్తులు సూర్యుని కిరణాలను ప్రతిబింబించడం ద్వారా వేడి ప్రభావాన్ని తగ్గిస్తాయి.ఇందుకోసమే తెల్లటి బట్టలు వేసుకునే ట్రెండ్ మొదలైంది.

మరో నివేదిక ప్రకారం, తెలుపు రంగు వస్త్రం చౌకదిగా పరిగణిస్తారు.అలాగే అది ఎక్కడైనా సులభంగా లభిస్తుంది.

అందుకే పెయింటర్లు తమ వృత్తి కోసం తెలుపు రంగు దుస్తులను ఎంచుకున్నారని చెబుతారు.అదే సమయంలో ఇది పెయింటర్స్ యూనియన్ రంగు అని మరొక నివేదిక పేర్కొంది.

అందుకేవారు తెలుపురంగు దుస్తులు ధరిస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube