నేను చనిపోలేదు.. 27 మంది డాక్టర్లతో చికిత్స

వివాదాస్పద గురువు నిత్యానంద స్వామి నిత్యానంద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అప్పట్లో నిత్యానంద రాసలీలల వీడియో తెగ వైరల్ అవ్వడంతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

అయితే.నిత్యానంద స్వామి చనిపోయారా? సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా ఈ విషయమై తీవ్ర రచ్చ జరుగుతున్నది.ఈ నేపథ్యంలోనే నిత్యానంద స్వామి స్వయంగా ఈ విషయంపై స్పందించారు.తాను బతికే ఉన్నారని ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు.

ఈక్వెడార్‌కు సమీపంలోని ఓ ద్వీపంలో నిత్యానంద స్వామి ఉంటున్నట్టు వార్తలు ఉన్నాయి.అయితే, ఆయన కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించినట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

ఈ వదంతులు ప్రచారం అయ్యాయి.దీంతో కొన్నాళ్లుగా భక్తుల్లో ఆందోళన చెలరేగింది.

ఈ గందరగోళం నేపథ్యంలో స్వామి నిత్యానంద స్వయంగా ఫేస్‌బుక్‌లో స్పందించారు.ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టారు.తాను మరణించలేదని ఆయన తెలిపారు.అయితే, తాను సమాధిలోకి వెళ్లారని వివరించారు.

తాను సమాధిలోకి వెళ్లానని, శిష్యులు కంగారుపడొద్దని స్పష్టం చేశారు.అయితే ప్రస్తుతానికి మాట్లాడలేకపోతున్నట్లు, మనుషులను గుర్తుపట్టలేకపోతున్నట్లు ఫేస్​బుక్​ పోస్ట్​లో పోస్ట్ చేశాడు.

తాను బతికే ఉన్నానని.తనకు 27 మంది వై ద్యులు చికిత్స అందిస్తున్నారని స్పష్టం చేశారు.

Telugu Ecuador, Kailash Island, Latest, Doctors-Latest News - Telugu

మన దేశంలో ఆయన లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.అందులో భాగంగానే ఆయన పలుమార్లు కోర్టు కేసుల్లో హాజరయ్యారు.2019 నవంబర్‌లో ఆయన భారత్ వదిలి వెళ్లిపోయారు.కొన్నాళ్లకు ఆయన ఈక్వెడార్ సమీపంలో ఓ దీవిలో ఉన్నట్టు తెలిసింది.

ఆ దీవిని స్వయంగా ఆయన కొనుగోలు చేశారని వార్తలు వచ్చాయి.దానికి ఆయన కైలాస దీవి అనే పేరు పెట్టారు.

ఆ కైలాస దీవికి ఆయనే ప్రధానమంత్రి అని ప్రకటించుకున్నారు.అంతేకాదు, ఆ దీవికి ప్రత్యేకంగా కరెన్సీ కూడా ప్రారంభించారు.

అంతేకాదు, ఆ కైలాస దీవిని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ఐరాసలోనూ విజ్ఞప్తి చేశాడు.కైలాస డాలర్‌ను ఆయన తెచ్చారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాసను ఆయన ప్రారంభించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube