సౌత్ డైరెక్టర్ నన్ను దారుణంగా తిట్టేవాడు.. హీరోయిన్ వైరల్ కామెంట్స్!

బాలీవుడ్ హీరోయిన్ నిక్కీ తంబోలి గురించి మనందరికీ తెలిసిందే.బాలీవుడ్ లో పలు సినిమాలలో నటించే హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది నిక్కి తంబోలి.

 Nikki Thamboli South Director Was Bad To Me Details,  Director,nikki Tamboli, In-TeluguStop.com

ఇకపోతే హీరోయిన్ నిక్కి తంబోలీ హిందీ బిగ్ బాస్ సీజన్ 14 లో పాల్గొన్న విషయం తెలిసిందే.అంతే కాకుండా ఆమె బిగ్ బాస్ షో సెకండ్ రన్న రప్ గా నిలిచిన విషయం తేలిసిందే.

బిగ్ బాస్ షో కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె మరింత పాపులారిటీని సంపాదించుకుంది.అంతేకాకుండా ఈ షో ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నిక్కీ తంబోలీ ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి మంచి ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిక్కి తంబోలి తన జీవితంలో జరిగిన పలు విషయాల గురించి పంచుకుంది.ఈ క్రమంలోనే ఆమె ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ.

దక్షిణాదిలో ఆమెకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని వివరించింది.ఆమెతో ఒక సౌత్‌ డైరెక్టర్‌ ప్రవర్తించిన తీరు తనకు అస్సలు నచ్చలేదని,సెట్స్‌లో ఆమెతో పాటు ఉన్న డ్యాన్సర్స్‌ అందరినీ మెచ్చుకుంటు, ఆమెను మాత్రం ఎక్కడినుంచి వస్తారో నీలాంటి వాళ్లు? అంటూ చాలా చులకన చేసి మాట్లాడారని చెప్పుకొచ్చింది నిక్కీ తంబోలీ.అయితే అప్పుడు ఆమెకు సౌత్ భాష మాట్లాడానికి వచ్చేది కాదని కానీ అతడు మాత్రం చాలా చెత్తగా ప్రవర్తించాడు అని చెప్పుకొచ్చింది నిక్కీ.

Telugu Actressnikki, Biggboss, Dance Show, Nikki Tamboli, Tina Sadhu, Tollywood-

అలాగే విదేశాలలో షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ఆమెను చీప్‌గా చూస్తూ దారుణంగా ప్రవర్తించేవాడని తెలిపింది.అయితే షూటింగ్ నుంచి ఆమె ఇంటికి వచ్చిన తరువాత బాద పడుతూ ఏడ్చేదట.కానీ ఎప్పుడు కూడా మధ్యలో వెనకడుగు వేయలేదు అని తెలిపింది.

అతను ఎన్ని విధాలుగా ఆమెని అవమానించినా ఎప్పటికైనా అతడు ఆమె తప్పును తెలుసుకుని ఫీల్‌ అవుతాడని భావించిందట.అయితే సదరు డైరెక్టర్ ఇప్పటికీ ఆమెకు మెసేజ్‌ చేస్తూనే ఉన్నాడు అని తెలిపింది.

కాగా నిక్కీ తంబోలి తెలుగులో చీకటి గదిలో చితక్కొట్టుడు, కాంచన 3, తిప్పరా మీసం లాంటి సినిమాలలో నటించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube