వైరల్: సముద్రంలోకి కొట్టుకుపోయిన అందమైన ఇల్లు.. చెక్కుచెదరకుండా అలలపై తెలియాడుతోంది!

సోషల్ మీడియా విస్తరణ పెరుగుతున్నవేళ ప్రపంచంలో జరుగుతున్న వివిధ రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలో ఓ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది.

 Viral Beautiful House Washed Into The Sea  Floating On The Waves Intact ,  Viral-TeluguStop.com

బేసిగ్గా సముద్ర తీరంలో ఇళ్లను నిర్మించడం అనేది ఎప్పటికైనా ప్రమాదమే.ఎందుకంటే మనకి తెలిసినదే, సముద్రం ఎప్పుడూ ఉన్న చోటే ఉండదు.

వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కాస్త ముందుకి వెనక్కి జరుగుతుంది.ఈ క్రమంలో సునామీ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందనేది మన ఊహకు అందదు.

సముద్రం ముందుకొచ్చి అమాంతంగా ఇళ్లను మింగేస్తుంది.తాజాగా నార్త్ కరోలినాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే, హట్టెరాస్ ద్వీపంలోని రోడంతే‌లో సముద్రం ఒక్కసారిగా ముందుకి జరగడంతో అలలు బలంగా తీరాన్ని తాకాయి.దీంతో సముద్ర తీరంలో ఉన్న ఓ ఇల్లు అందులో చిక్కుకుంది.

అయితే ఆ క్షణంలో ఆ ఇంట్లో ఎవరూ లేరు.అది చెక్కతో నిర్మించిన ఇల్లు కావడంతో క్షణాల్లోనే అది సముద్ర అలల తాకిడికి కూలిపోయింది.

ఆ తర్వాత అది సముద్ర అలలపైన తేలియాడుతూ కనిపించింది.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కేప్ హటెరాస్ నేషనల్ సీషోర్‌కు చెందిన యూఎస్ నేషనల్ పార్క్ సర్వీస్ అధికారులు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఇక్కడ ఒక్క రోజు వ్యవధిలోనే 2 ఇళ్లు సముద్రంలో కలిసిపోయాయని తెలిపారు.ఇవే కాకుండా ఇంకా ఆ ప్రాంతంలో మరో 9 ఇళ్లు కూడా కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.సముద్రం ఇంకా ముందుకొస్తే భవిష్యత్తులో మరిన్ని ఇళ్లు ప్రమాదంలో చిక్కుకునే అవకాశాలున్నాయని, స్థానికులు ఈ విషయాన్ని అర్ధం చేసుకొని, వేరే ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు.అధికారులు పోస్టు చేసిన వీడియోలని ఇల్లు విలువ సుమారు దాదాపు రూ.2.95 కోట్లు ఉంటుందని అంచనా.కాగా ఈ వీడియో తిలకిస్తున్న నెటిజనులు, తీరానికి అంత దగ్గర్లో ఇల్లు కట్టేందుకు అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube