పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. త్వరలో కొత్త రూల్స్

దేశంలో రెండవ అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థగా ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్లకు షాక్ కల్గిస్తోంది.మినిమమ్ బ్యాలెన్స్, మెయింటెనెన్స్ ఛార్జీలు విపరీతంగా పెంచేసింది.

 Alert For Punjab National Bank Customers New Rules Coming Soon , Pnb, Alerts, N-TeluguStop.com

ఉచిత లావాదేవీల లిమిట్‌లో కూడా మార్పులు చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కొత్త నిబంధనల గురించి తెలుసుకోకపోతే.

ఖాతాలో డబ్బులు కట్ అయిపోతాయి.ఈ కొత్త రూల్స్ మే 29 నుంచి అమలులోకి వస్తాయి.దీంతో పాటు ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లింక్డ్ లెండింగ్ రేట్ 0.40 శాతం పెంచి 6.90 శాతం చేసినట్టు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రకటించింది.ఆర్.

బి.ఐ రెపో రేట్‌ను 40 బేసిస్ పాయింట్స్ పెంచిన సంగతి తెలిసిందే.దీంతో బ్యాంకు కూడా వడ్డీ రేటును 0.40 శాతం పెంచింది.సేవింగ్స్ అకౌంట్, ఇతర అకౌంట్లలో ఉచిత లావాదేవీల సంఖ్యలో మార్పులు ఉన్నాయి.

మరి ఏ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉన్నాయో తెలుసుకోండి.

Savings Account:

పంజాబ్ నేషనల్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ట్రాన్సాక్షన్ లిమిట్‌ను పెంచింది.లిమిట్ తో పాటు.

లిమిట్ దాటిన తర్వాత వసూలు చేసే ఛార్జీలు కూడా పెరిగాయి.గతంలో ఒక ఆర్థిక సంవత్సరంలో ఉచిత ట్రాన్సాక్షన్స్ లిమిట్ 40 ఉండగా, ఆ తర్వాత ప్రతీ లావాదేవీపై రూ.2 చొప్పున ఛార్జీ వసూలు చేసేది.ఇకపై 50 ఉచిత ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు.ఆ తర్వాత ప్రతీ లావాదేవీపై రూ.10 చొప్పున ఛార్జీ చెల్లించాలి.

Cheque Returning Charges:

చెక్ రిటర్నింగ్ ఛార్జీల విషయంలో కొత్త శ్లాబ్ ప్రతిపాదించింది.రూ.1,00,000 నుంచి రూ.10,00,000 వరకు ఔట్‌వర్డ్ ట్రాన్సాక్షన్స్‌పై రూ.250 ఛార్జీలు చెల్లించాలి.రూ.10,00,000 కన్నా ఎక్కువైతే ప్రతీ లావాదేవీకి రూ.500 చొప్పున చెల్లించాలి.

Cheque Book Issuance:

పంజాబ్ నేషనల్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లకు ఇచ్చే చెక్ బుక్‌లో ఇకపై 25 కాకుండా 20 చెక్స్ మాత్రమే ఉంటాయి.

Telugu Bank, Latest, Pnb, Punjabnational-Latest News - Telugu

Locker Charges:

సాధారణంగా బ్యాంకు లాకర్లలో జ్యువెల్లరీ, ముఖ్యమైన పేపర్లు వంటి వాటిని దాచి పెడుతుంటారు.బ్యాంకు లాకర్ తీసుకుంటే ఇందుకు గాను ఆయా బ్యాంకులు ఛార్జీలను వసూలు చేస్తాయి.లాకర్ సైజ్, ప్రాంతాన్ని బట్టి (అర్బన్, మెట్రో, రూరల్) బ్యాంకు లాకర్ ఛార్జీలు ఉంటాయి.

లాకర్ ఛార్జీలు ఆలస్యం చేస్తే యాన్యువల్ రెంట్‌లో 25 శాతం పెనాల్టీ చెల్లించాలి.ఒక ఏడాది నుంచి మూడేళ్ల వరకు జాప్యం చేస్తే యాన్యువల్ రెంట్‌లో 50 శాతం చెల్లించాలి.

మూడేళ్ల కన్నా ఎక్కువ ఆలస్యం చేస్తే బ్యాంకు ఆ లాకర్‌ను పగలగొట్టి తెరుస్తుంది.అయితే ఐదేళ్ల లాకర్ రెంట్ ఒకేసారి చెల్లించే అవకాశం ఇస్తోంది.పలు మెట్రో శాఖలలో 25 శాతం ప్రీమియం రెంట్ ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి.ఒకవేళ లాకర్ హోల్డర్ అడ్వాన్స్‌గా అద్దె చెల్లించిన ఐదేళ్ల వ్యవధి ముగిసేలోపు లాకర్‌ను సరెండర్ చేస్తే, యాన్యువల్ కార్డ్ రేట్ ప్రకారం లాకర్ అద్దె వసూలు చేస్తారు.

Other Charges:

ఇక కరెంట్, క్యాష్ క్రెడిట్, ఓవర్‌డ్రాఫ్ట్, ఇతర అకౌంట్లలో రోజూ రూ.1,00,000 వరకు లావాదేవీలపై ఛార్జీలు ఉండవు.రూ.1,00,000 కన్నా ఎక్కువ లావాదేవీలపై ప్రతీ రూ.1,000 కి రూ.10 చొప్పున ఛార్జీలు చెల్లించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube