మహేష్ బాబు హెల్త్ మినిస్టర్.. షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్ పరశురామ్!

గీతా గోవిందం సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు పరశురామ్ ప్రస్తుతం మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఇక ఈ సినిమా ఈ నెల 12వ తేదీ విడుదల కానుంది.

 Mahesh Babu Is The Health Minister Director Parashuram Shocking Comments , Mahes-TeluguStop.com

ఈ క్రమంలోనే చిత్రబృందం పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా డైరెక్టర్ పరశురామ్, మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా యాంకర్ సుమ మహేష్ బాబు ని డైరెక్ట్ ఎన్నో రకాల ప్రశ్నలు అడుగుతూ సమాధానం రాబట్టారు.

ఈ క్రమంలోని సుమ మాట్లాడుతూ మీరు కనుక ప్రధాన మంత్రి అయితే అని మాట్లాడుతూ ఉండగా వెంటనే మహేష్ బాబు ఎందుకండి ప్రస్తుతం యాక్టర్ గా మంచిగా ఉన్నాను ప్రధానమంత్రి ఎందుకు అంటూ కామెంట్ చేశారు.

ఇకపోతే అదే ప్రశ్నను డైరెక్టర్ పరశురామ్ ను అడుగుతూ మీరు గనక ప్రధానమంత్రి అయితే మీ కేబినెట్లో ఎవరికి ఎలాంటి పదవులు ఇస్తారు అంటూ ప్రశ్నించారు.

Telugu Parashuram, Mahesh Babu, Tollywood-Movie

ఈ సందర్భంగా సుమ ప్రశ్నిస్తూ హెల్త్ మినిస్టర్ గా ఎవరిని ఎంపిక చేసుకుంటారనీ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు డైరెక్టర్ పరశురామ్,మహేష్ బాబు ఇద్దరు ఒకే సారి సమాధానం చెబుతూ హెల్త్ మినిస్టర్ అయితే నేనే కరెక్టుగా సరిపోతాను అంటూ మహేష్ బాబు సమాధానం చెప్పారు.ఇక పరశురామ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.

ఆరోగ్య విషయంలో మహేష్ బాబు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారని, ఆయనే హెల్త్ మినిస్టర్ గా కరెక్ట్ గా సరిపోతారని పరశురామ్ వెల్లడించారు.ఇక సుమ మాట్లాడుతూ మీరు కనుక హెల్త్ మినిస్టర్ అయితే మా ఆరోగ్యాలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి అంటూ చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube