హైదరాబాద్ లో ప్రారంభమైన ప్రాజెక్టు కే షూటింగ్... షూటింగ్ లో పాల్గొననున్న ప్రభాస్!

మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా ప్రాజెక్ట్ కె అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించారు.

 Project K Shooting Started In Hyderabad Prabhas Will On The Shooting , Project K-TeluguStop.com

ఇలా సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా ప్రభాస్ మోకాలు సర్జరీ కారణంగా కొద్ది రోజుల పాటు ఈ సినిమా చిత్రీకరణ వాయిదా వేశారు.ఈ క్రమంలోనే ప్రభాస్ మోకాలు సర్జరీ చేయించుకుని విశ్రాంతి తీసుకున్నారు.

అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ తిరిగి హైదరాబాద్ లో ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

ఇప్పటికే హైదరాబాద్ లో షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకున్న చిత్రబృందం తన తదుపరి షెడ్యూలు కూడా హైదరాబాద్లోనే చిత్రీకరించనున్నారు.

సీనియర్ ఆర్ట్ డైరెక్టర్ తోటతరణి సారథ్యంలో, హైదరాబాదులో నిర్మించబడిన మూడు భారీ సెట్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది.ఈ సినిమా షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా హీరో ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబచ్చన్ షూటింగ్ లో పాల్గొననున్నట్టు సమాచారం.

Telugu Hyderabad, Nag Ashwin, Prabhas, Prabhasknee, Project, Tollywood-Movie

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటోంది.ప్రభాస్ సర్జరీ కారణంగా ఈ సినిమా చిత్రీకరణకు బ్రేకులు పడ్డాయి.ఇక ఈ సినిమా నిర్మాణంలో భాగంగా ఆనంద్ మహేంద్ర సహాయం తీసుకోనున్నట్లు ఇదివరకే చిత్రబృందం వెల్లడించారు.పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube